GOOD PRE RELEASE BUSINESS FOR LOVE STORY WILL TURN FOR NAGA CHAITANYA CAREER BEST MOVIE MHN
Naga Chaitanya - Sai Pallavi - Love Story: 'లవ్‌స్టోరి' ప్రీ రిలీజ్ బిజినెస్... చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందా?
Good pre release business for Love story will turn for naga chaitanya career best movie
Naga Chaitanya - Sai Pallavi - Love Story: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ 'లవ్‌స్టోరి'. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ 'లవ్‌స్టోరి'. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణంగా 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. చైతన్య, సాయిపల్లవి జోడీ స్క్రీన్‌పై చూడచక్కగా అనిపిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాట, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా విడుదలైన సారంగ దరియా.. సాంగ్‌కు పది మిలియన్ వ్యూస్ రావడం చూస్తే సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు ఊహించని రేంజ్లో బిజినెస్ ఆఫర్స్ వచ్చాయట. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు 'లవ్‌స్టోరి' సినిమా ఆంధ్ర ప్రాంతం హక్కులు రు.15 కోట్లకు అమ్మడయ్యాయట. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ వాళ్లకు నైజాంలో ఎలాగూ ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి .. నైజాం ఏరియాలో వాళ్లే ఓన్ రిలీజ్ చేసుకుంటారు.
ఇక శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్సీస్లో మంచి ఆదరణే దక్కుతుంది. ఆ క్రేజ్‌తో 'లవ్‌స్టోరి' సినిమా ఓవర్సీస్ హక్కులు 6 కోట్లకు అమ్ముడయ్యాయట. ఇక శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి దాదాపు యాబై కోట్ల మేరకు నిర్మాతలకు బిజినెస్ జరిగింది. నాగచైతన్య కెరీర్లో బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఏప్రిల్ 16న లవ్‌స్టోరి విడుదల కానుంది. మరి విడుదల తర్వాత ఈ అంచనాలను అందుకుంటే థియేట్రికల్‌గానే సినిమా యాబై కోట్లు టచ్ చేస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి చైతన్య కెరీర్ బెస్ట్ హిట్‌ను సాధిస్తాడో లేదో చూడాలి మరి.
సునీల్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు 'లవ్‌స్టోరి' సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చైతన్య, విక్రమ్ కుమార్‌తో కలిసి 'థాంక్యూ' సినిమా షూటింగ్లో బిజి బిజీగా ఉన్నాడు. మరో వైపు చైతన్య డిజిటల్ ఎంట్రీ కూడా ఉంటుందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.