Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కార్తీక దీపం’కు ఇప్పట్లో శుభం కార్డ్ లేనట్లే..!

కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam)

Karthika Deepam: వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియన్ నటిని ఇంతగా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్ సంపాదించుకుంది..

  • Share this:
వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియన్ నటిని ఇంతగా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్ సంపాదించుకుంది ప్రేమీ విశ్వనాథ్. ఈమె పేరు ఇది అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారేమో మరి..? తెలుగు రాష్ట్రాల్లో టీఆర్పీ పరంగా చూసుకున్నా కూడా కార్తీక దీపం నెంబర్ వన్ అంతే. దాని దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ రాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళొస్తే కూడా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఇంటింటికీ ఎలా చేరిపోయిందో..? ఇదిలా ఉంటే ఈ మధ్య సీరియల్‌లో వస్తున్న కొన్ని ట్విస్టులు చూసిన తర్వాత కార్తీక దీపం సీరియల్ అయిపోతుందేమో అనే ఆందోళన అభిమానుల్లో కనబడుతుంది. దీపకు కార్తీక్ చేరువ అయిపోతున్నాడు.. మోనితను దూరం పెడుతున్నాడు.. పైగా పిల్లలు హిమ, శౌర్య కూడా చేరువ అవుతున్నారు.. అన్నింటికీ మించి కార్తీక్‌లో కొద్దికొద్దిగా మార్పు కనిపిస్తుంది.. దాంతో ఈ సీరియల్ అయిపోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

karthika deepam serial how many episodes remaining,karthika deepam serial latest episode hotstar,karthika deepam serial vantalakka,karthika deepam serial anchor suma,karthika deepam serial team start music program,anchor suma warning to doctor babu,karthika deepam serial hima photos,karthika deepam serial hima eka baby sahruda,karthika deepam telugu serial,telugu cinema,karthika deepam serial hima age,కార్తీక దీపం,కార్తీక దీపం వంటలక్క కూతురు హిమ,కార్తీక దీపం యాంకర్ సుమ వంటలక్క సపోర్ట్,కార్తీక దీపం సుమ డాక్టర్ బాబు,కార్తీక దీపం ఎపిసోడ్స్ బాకీ
కార్తీక దీపం(Hot Star)


ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది.. రాబోయే నెల, రెండు నెలల్లోనే కార్తీక దీపంకు శుభం కార్డ్ పడటం ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇప్పట్లో ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడటం కష్టమే. మలయాళంలో నాలుగేళ్ల పాటు నిర్విరామంగా దాదాపు 1450 ఎపిసోడ్స్ రన్ అయింది కార్తీక దీపం. తెలుగులో కూడా 2017 అక్టోబర్‌లో మొదలైంది. ఈ లెక్కన మూడేళ్ళు అయిపోయింది. దాదాపు ఆర్నెళ్లకు పైగానే బాకీ ఉంది.

ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)


ఎలా చూసుకున్నా కూడా కార్తీక దీపం మరో 200 ఎపిసోడ్స్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే 2021 కూడా కార్తీక దీపంకు వచ్చిన ముప్పేం లేదన్నమాట. కచ్చితంగా మరో ఏడాది వరకు ఈ సీరియల్ ఉంటుంది. ఇది నిజంగా వంటలక్క ఫ్యాన్స్‌కు శుభవార్తే.
Published by:Praveen Kumar Vadla
First published: