ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే సమయం ముందుకొచ్చింది. తమ అభిమాన హీరో సినిమా రాధేశ్యామ్ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. సాహో సినిమా బాలీవుడ్‌లో మినహా మరో భాషలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. రీసెంట్‌గా జూన్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయని కూడా టాక్ నడిచింది.
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు రాధేశ్యామ్ విడుదలను ప్రీ పోన్ చేశారట. వివరాల మేరకు మార్చి 30న ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. అన్నీ భాషల్లో తగిన రిలీజ్ డేట్ చూసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో భాగంగానే మేకర్స్ సినిమాను ముందుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడట. దీని తర్వాత ఓంరావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో తెరకెక్కనున్న రామాయణంలో ప్రభాస్ నటిస్తాడు. దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నద్ధమవుతాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam