Jr NTR: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. యంగ్ టైగర్‌కి కరోనా నెగటివ్!

Jr NTR

Jr NTR: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత అల్లకల్లోలంగా ఉందో అందరికీ తెలిసిందే. రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి.

  • Share this:
    Jr NTR: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత అల్లకల్లోలంగా ఉందో అందరికీ తెలిసిందే. రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఓవైపు వ్యాక్సిన్ అందిస్తూనే ఉండగా.. మరోవైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అన్ని రంగాల ప్రవేశాలు నిషేదించగా.. లాక్‌డౌన్‌ కూడా ప్రకటించారు. ఇక సినీ ఇండస్ట్రీ కూడా లాక్‌డౌన్‌ ముందే షూటింగ్ లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

    ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రెటీలు, దర్శక నిర్మాతలు కరోనా బారిన పడగా.. కొందరు ప్రాణాలు కూడా విడిచారు. ఇక హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడగా ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పటికీ సినిమాలు వాయిదా వేసి నెల కావడానికి వస్తుండగా.. మళ్లీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు వైరస్ పాజిటివ్ అని తేలుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కరోనా ను జయించాడు.

    కొన్ని రోజుల కిందట ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ తేలిందని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా తనతో పాటు సన్నిహితంగా ఉన్న వాళ్లను కూడా టెస్ట్ చేయించుకోమని కోరాడు. ఆయనకు వైరస్ సోకిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ట్వీట్లు కూడా చేశారు. తాజాగా తను వైరస్ నుంచి బయటపడిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

    మళ్లీ టెస్ట్ చేయించుకోగా తనకు నెగటివ్ వచ్చిందని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ విషయం గురించి చెప్పడానికి చాలా ఆనందంగా ఉందంటూ.. తను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా డాక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ వైరస్ గురించి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని తెలిపాడు ఎన్టీఆర్. ఇక ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు సంతోషంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
    Published by:Navya Reddy
    First published: