సినీ ప్రియులకు గుడ్ న్యూస్... త్వరలోనే తెరుచుకోనున్న థియేటర్లు..?

సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, ధియేటర్లు (ఓపెన్ ఎయిర్ ధియేటర్లు మినహా), మూసి ఉంటాయి.

Theatres Opening: గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ కార‌ణంగా మార్చ్ 25 నుంచి మూతప‌డిన సినిమా హాల్స్ అన్నీ మళ్లీ తెరుచుకోబోతున్నాయని ప్రచారం జరుగుతుంది.

  • Share this:
గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ కార‌ణంగా మార్చ్ 25 నుంచి మూతప‌డిన సినిమా హాల్స్ అన్నీ మళ్లీ తెరుచుకోబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని కండీషన్స్ ఉన్నాయి. కేవలం గ్రీన్ జోన్‌లలో మాత్రమే ఈ సినిమా హాల్స్ తెరుచుకోనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వంతో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు సినీ పెద్దలు. చాలా కాలంగా షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో వేలాది మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వాళ్లకు మళ్లీ పని దొరకాలంటే షూటింగ్స్ మొదలవ్వాలి.. దాంతో పాటు సినిమా హాల్స్ ఓపెన్ అయితే అక్కడ పని చేసే వాళ్లకు కూడా ఉపాధి దొరుకుతుంది.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


భౌతిక దూరం పాటిస్తూనే థియేటర్స్ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సినీ పెద్దలు. దీనికి సమాధానంగా మే 18 నుంచి థియేటర్స్ తెరుచుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను మెల్లగా సడలిస్తూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే వైన్ షాపులు కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు సినిమా హాల్స్ వైపు వస్తున్నాయి. ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మే 18 నుంచి గ్రీన్‌జోన్ పరిధిలో ఉన్న షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


రెడ్ జోన్స్, అరంజ్ జోన్స్ మిన‌హా గ్రీన్ జోన్‌లలో మాత్రం రిస్క్ తీసుకోడానికి యిష్టపడటం లేదు ప్రభుత్వం. ఇక గ్రీన్‌జోన్‌లో సైతం కేవలం మూడు ఆట‌ల‌కు మాత్రమే అనుమ‌తులివ్వాలని చూస్తుంది. రాత్రి 7 గంట‌ల్లోపే మూడు షోలు పూర్తి చేయాలని నిబంధన పెట్టనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమా హాల్స్‌లో సీటుకి సీటుకి మధ్య గ్యాప్ ఉండాలని సూచించింది. ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించాల‌ని నిబంధ‌న విధించింది.. మాస్క్ ధ‌రించాల‌ని కోరింది.. అలాగే గ్రీన్ జోన్స్‌లోని మాల్స్ కూడా ఇదే త‌ర‌హా నిబంద‌న‌లు అమ‌లుతో అనుమ‌తి ఇవ్వ‌నున్నట్లు తెలుస్తుంది.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


షాపింగ్ మాల్స్ సైతం సాయంత్రం 6 గంట‌లలోగా మూసివేయాలని కేంద్రం సూచించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సినిమా పెద్దలు కూడా ప్రభుత్వ నిబంధనలన్నింటికీ కూడా ఓకే చెప్తున్నారు. ముందు ఏదో రకంగా సగం ఆదాయమైనా వస్తుందనే భావనలో సినీ ఇండస్ట్రీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే సినీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కలవాలనే భావనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదల ఆగిపోవడంతో షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


అలా ఎంతో మంది కార్మికులకు ఉపాధి పోయింది.. షూటింగ్‌లు మొదలైతే వారికి మళ్లీ ఉపాధి వస్తుంది. అవసరమైతే ధియేటర్లలో సగం సీట్లు తాత్కాలికంగా తీసేయడానికి కూడా సిద్ధమే అని ప్రభుత్వానికి హామీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. చూడాలిక.. ఏం జరగబోతుందో..? అన్నీ కుదిరి మే 18 నుంచి థియేటర్స్ ఓపెన్ అయితే సినిమాలు రిలీజ్ చేస్తారా.. చేస్తే వచ్చే వసూళ్లు సరిపోతాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Published by:Praveen Kumar Vadla
First published: