టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జిఎంబి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఆ మధ్య ఆగస్ట్ 9న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అందులో మహేష్ బాబును చూసి వింటేజ్ బాబు ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు దర్శకుడు పరశురామ్‌కు కూడా థ్యాంక్యూ చెప్తున్నారు. ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ రాసి పెట్టుకోండి అంటూ మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ధి మరీ చెప్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఈ మధ్య స్పెయిన్‌లో మహేశ్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగింది. షూటింగ్‌లో భాగంగా ఆయనకు గాయం కావడంతో.. అది పెద్దది కాకుండా సర్జరీ వరకు వెళ్లారు మహేశ్ బాబు.
ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నాడు. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నాడు సూపర్ స్టార్. రెండు నెలల తర్వాత ఇండియాకు రావాలని చూస్తున్నారు. పనిలో పనిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా దుబాయ్‌లోనే ప్లాన్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం కుటుంబంతో పాటు అక్కడే ఉన్నాడు ఈ హీరో.
సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తయింది. నెలరోజుల చిత్రం చిత్రీకరణ మాత్రం బాకీ ఉంది. ఆల్రెడీ ఫిబ్రవరి నెల నుంచి ఈ షూటింగ్ ని స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ కూడా అప్పటికి రెడీ అయ్యిపోనున్నారు. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మహేశ్ బాబు సంతృప్తిగా లేడని.. అందుకే పరశురామ్ అండ్ టీం మరోసారి క్లైమాక్స్ విషయంలో కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 120 కోట్ల వరకు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : తగ్గేదే లే.. బుల్లి తెరపై కూడా దుమ్మురేపిన లవ్ స్టోరీ.. ఎంత రేటింగ్ అంటే..
అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం మహేశ్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ మధ్య చాలా మంది హీరోలు తమ సినిమాల్లో కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. కానీ సర్కారు వారి పాట విషయంలో నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ లిస్టులో మరో సూపర్ హిట్ రీమేక్.. ఈ సారి మాత్రం..
కేవలం తెలుగు వరకు మాత్రమే వాళ్లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే చేరువయ్యేలా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనవసరంగా రిస్క్ తీసుకొని అన్ని భాషల్లో విడుదల చేసి ఆ తర్వాత ఫలితాలను చూసి బాధపడటం కంటే.. ముందుగానే పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్నారు మహేశ్ బాబు అండ్ టీం. ఏప్రిల్ 1, 2022న ఈ సినిమా విడుదల కానుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthi Suresh, Mahesh Babu Latest News, Sarkaru Vaari Paata, Super star mahesh babu, Tollywood news