పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉబ్బితబ్బిబవుతున్న ఫ్యాన్స్..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ 'పింక్' సినిమా రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే..

news18-telugu
Updated: February 8, 2020, 8:00 AM IST
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉబ్బితబ్బిబవుతున్న ఫ్యాన్స్..
ఈ సినిమాకు డాలీ, గోపీచంద్ మలినేనిలో ఎవరో ఒకరు దర్శకుడిగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇందులో రానా, రవితేజలలో ఎవరో ఒకరు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • Share this:
Pawan Kalyan : పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' చిత్రం చేసి ఇక ఇదే నా చివరి సినిమా అంటూ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండు సంవత్సరాలు వెండితెరకు దూరమయ్యాడు. ఆ సినిమా తర్వాత ఇంత వరకూ ఏ సినిమాల్లో నటించలేదు పవన్. దీంతో పెద్దగా మేకోవర్ లేకుండా అప్పటి నుంచి గుబురు గెడ్డంతో కనిపిస్తూ తన రాజకీయాలేవో చేసుకునేవాడు. కాగా రెండేళ్ల విరామం అనంతరం ఆయన మూడు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పాడు. అందులో భాగంగా మొదటగా హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింక్' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. మహిళలపై లైంగింక వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన ‘పింక్‌’ రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నాడు. దీంతో పాటు క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ‘పింక్‌’ రిమేక్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రలో పవన్‌ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో 'వకీల్ సాబ్' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను MCA ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. మే 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అది అలా ఉంటే ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు థమన్ ఓ అదిరిపోయే వార్త చెప్పాడు.


థమన్ అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా పెద్ద సెన్సేషన్ అయ్యి సినిమా రిలీజ్ ముందే సూపర్ క్రేజ్ తెచ్చాయి. దీంతో థమన్ తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నాడు. దీంతో థమన్ చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మహేష్ నెక్స్ట్ మూవీతో పాటు, పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కూడా ఉంది. ఈ సందర్భంగా థమన్ తాజాగా తన సోషల్ మీడియావేదికగా పవన్ ఫ్యాన్స్‌కి ఓ తీపి కబురు తెలిపాడు. థమన్, పవన్ కళ్యాన్‌ పింక్ రీమేక్‌కి సంబంధించి కొన్ని పవన్ కళ్యాణ్ పిక్స్‌ను చూశాడట. ఈ పిక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుపుతూ.. వాటి గురించి ఎక్కువ చెప్పనులే గాని, పింక్ రీమేక్ కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి బెస్ట్ ట్యూన్స్ ఇస్తానని మాట ఇస్తున్నాని తెలిపాడు. 'అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ ఫామ్‌లో థమన్ అలా చెప్పడంతో పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పింక్ రీమేక్ లో సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయని భావిస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: February 8, 2020, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading