Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ నెల 25 నుంచి పునఃప్రారంభం..

Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఖరారు చేశారు. కొద్ది రోజుల షూటింగ్ జరుపుకున్నఈ చిత్రం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

  • Share this:
    పవన్ కళ్యాణ్.. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఓ నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. అందులో భాగంగా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు (hari hara veeramallu) ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఖరారు చేశారు. కొద్ది రోజుల షూటింగ్ జరుపుకున్నఈ చిత్రం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. కొద్ది రోజులుగా భీమ్లా నాయక్  (Bheemla Nayak)చిత్రంతో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి పవన్‌ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సెట్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఫైట్ సీన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది హరిహర వీరమల్లు.

    ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదలవుతోంది. ఏ. ఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. సినిమా కంప్లీట్ గా 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని పవన్ పాత్ర కూడా రాబిన్ హుడ్ తరహాలో చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను ఆధారంగా చేసుకొని కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు క్రిష్ తెలియజేశాడు.. ఇప్పటివరకు తెలుగులోనే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూడలేదని కూడా ఈ దర్శకుడు నమ్మకంగా తెలియజేశాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

    Director Shankar : 16 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో బుక్కైనా మెగా డైరెక్టర్ శంకర్ అల్లుడు..

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.

    Pragya Jaiswal : వైట్ టాప్‌లో ప్రగ్యా పరువాల విందు.. అదిరిన ఫోటో షూట్..

    ఇక ఆ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్.

    ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. (Rana daggubati) రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే పేరును ఖరారు చేశారు, త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్తా మీనన్, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: