Keerthy Suresh : కీర్తి సురేష్ అభిమానులకు శుభవార్త.. నవంబర్‌లో ముహూర్తం..

Keerthy Suresh Photo : Twitter

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్ జోడిగా సర్కారు వారి పాటలో నటిస్తోంది. అది అలా ఉంటే నిన్న ఆమె బర్త్ డే సందర్భంగా గుడ్ లక్ సఖి గురించి అప్ డేట్ వచ్చింది.

  • Share this:
    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్‌కు జోడిగా (Sarkaru Vaari Paata) సర్కారు వారి పాటలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా వస్తున్న దసరాలోను నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి నటిస్తున్న మరో చిత్రం (Good Luck Sakhi) గుడ్ లక్ సఖి.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టాక్ రాగా.. అలాంటిదేమి లేదని తెలుస్తోంది. నిన్న కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్ డేట్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాని నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విడుదలపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

    కీర్తి సురేష్‌ టైటిల్‌ పాత్రలో వస్తున్న ఈ సినిమాకు నాగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించగా.. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలో వస్తుండగా.. కీర్తి షూటర్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.



    ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది.

    Balakrishna : గోపీచంద్ సినిమా కోసం మరోసారి క్రేజీ పాత్రలో బాలకృష్ణ..

    ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఈ రెండు సినిమాలతో పాటు కీర్తి తెలుగులో మరో సినిమాలోను నటిస్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న దసరా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    TV actress Uma Maheshwari passes away : ప్రముఖ టీవీ నటి ఉమా మహేశ్వరి కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ..

    వీటితో పాటు కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో..
    Published by:Suresh Rachamalla
    First published: