మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. కాగా ఇటీవల ఆచార్య ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
అది అలా ఉంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్ ఫాదర్' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉండగా.. వీటిలో ముందుగా బాబీ సినిమానే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా మంచి మాస్ మసాలా కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇక ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మలయాళీ హిట్ సినిమా లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
Pooja Hegde: వేడి పుట్టిస్తోన్న పూజా హెగ్డే.. షర్ట్ తీసేస్తూ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Tollywood news