అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న అందాల తార. అనుష్క డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. అది అలా ఉంటే అనుష్క కొన్నాళ్లుగా ఎలాంటి సినిమాలను చేయడం లేదు. అయితే ఇన్నాళ్లకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చింది. అనుష్క బర్త్ డే సందర్భంగా ఆ మధ్య ఓ ప్రకటన విడుదలవ్వగా.. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి చేస్తున్నారని మరో ప్రకటన విడుదల చేసింది టీమ్. నవీన్ పొలిశెట్టి ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు అనుష్క కూడా నవీన్ పొలిశెట్టికి బర్త్ డే విషెస్ తెలుపుతూ గ్రీట్ చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. దీంతో ఇన్నాళ్లకు అనుష్క ఓ సినిమాకు ఓకే చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అనుష్క విషయానికి వస్తే.. గత 3-4 ఏళ్ల నుంచి అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది. ప్రభాస్ (Bahubali series) బాహుబలి-2 తర్వాత (Bhaagamathie) భాగమతి చేసింది. ఆ తర్వాత సైరాలో ఓ చిన్న పాత్ర చేసింది అనుష్క. ఇక ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాల తర్వాత ఆమె ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. మరోవైపు ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో మంది సిద్ధంగా ఉన్నా కూడ ఆమె సైన్ చెయ్యట్లేదు. ఇక ఇన్ని రోజులకు అనుష్క ఈ సినిమాను చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ముఖ్యంగా వైవాహిక వ్యవస్థపై నమ్మకం లేని ఓ అమ్మాయి, తనకంటే చిన్నవాడైన ఓ అబ్బాయితో డేటింగ్ అనే కాన్సెప్ట్‌తో వస్తోందని టాక్. యూవీ క్రియేషన్స్ సంస్ధ ఈ సినిమాను ఓ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ గా చెప్తోంది.
Happy birthday @NaveenPolishety .. ? welcome on board#ProductionNo14 ?looking forward …..have a great day and a beautiful year ahead Directed by #MaheshBabuP Produced by @UV_Creations#HBDNaveenPolishetty #Anushka48 #NaveenPolishetty3 pic.twitter.com/FO2p9KqmXy
— Anushka Shetty (@MsAnushkaShetty) December 26, 2021
ఇక అది అలా ఉంటే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు అనుష్క మరో సినిమాను ఓకే చేసిందని అంటున్నారు. తమిళ తెలుగు భాషాల్లో రూపోందనున్న ఓ సినిమాకు ఆమె ఓకే చెప్పిందని టాక్. వివరాల్లోకి వెళితే.. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో పి వాసు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'చంద్రముఖి' సీక్వెల్‌లో( Chandramukhi sequel) అనుష్క నటించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ విన్నా అనుష్క ఈ సినిమాను ఓకే చేసిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Ileana : ఇలియానా అదిరే అందాలు.. రెడ్ టాప్‌లో కవ్విస్తోన్న గోవా బ్యూటీ..
తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలు ప్రకారం.. అనుష్క ‘చంద్రముఖి’ సీక్వెల్‌లో నటించడం ఖరారు అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ నటించట్లేదు. ఆ ప్లేస్‌లో డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కనపడనున్నారు. ఈ సినిమాకు ‘చంద్రముఖి’ దర్శకుడు పి.వాసు డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రను అనుష్క చేయబోతోందని.. సినిమాలో ఆమెదే కీలకమైన పాత్ర అని అంటున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.