Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 10, 2020, 12:27 PM IST
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అదేంటి.. టికెట్స్ ఫ్రీ ఇవ్వడం ఏంటి.. డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ టికెట్స్ దొరక్క చచ్చిపోతుంటే ఫ్రీగా ఎవడిస్తాడింక అనుకుంటున్నారా..? అవును నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ చోట మాత్రం అల వైకుంఠపురములో సినిమా టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడం కోసం బయ్యర్లే ఈ ఆఫర్ పెట్టారు. అయితే ఇలాంటి ఆఫర్స్ మన దగ్గర పెడితే కష్టమే కానీ అమెరికాలో అయితే వర్కవుట్ అవుతుంది. అక్కడ ఈ చిత్రాన్ని భారీగానే విడుదల చేస్తున్నారు. బన్నీ రేంజ్ ఈ సినిమాతో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

అల వైకుంఠపురములో పోస్టర్
అక్కడ 9 కోట్లకు రైట్స్ అమ్మేసారు. ఇక ఈ సినిమాను తమ బిజినెస్ కోసం వాడేసుకుంటున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. ముఖ్యంగా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చేందుకు ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నారు బయ్యర్లు. టికెట్ ధరలపై అద్భుత ఆఫర్లు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్. అక్కడ రీగల్ సినిమాస్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాము అందించే అన్ లిమిటెడ్ పాస్‌లు కొన్న వాళ్లకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామంటూ వాళ్లు ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. మరికొన్ని చోట్ల కేవలం రెండు డాలర్లకి మాత్రం ఈ చిత్ర టికెట్స్ అమ్ముతున్నారు బయ్యర్లు.

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్
ఏఎంసి సంస్థ తమ స్టబ్స్ ఏ-లిస్ట్ చందాదారులకు కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తూ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం అక్కడ ఒక్కో టికెట్ ధర 14 డాలర్ల వరకు ఉంది.. సినీమార్క్ సినిమాస్, మూవీ క్లబ్ పాస్ ఉన్నవారికి ధరలు ఐదు డాలర్లు డిస్కౌంట్ ప్రకటించింది రీగల్ సినిమాస్. కొన్ని లోకల్ టికెట్ వెబ్‌సైట్స్ కూడా తమ సైట్లోంచి టికెట్స్ బుక్ చేసుకుంటే 50 పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు. అలా మొత్తానికి అల వైకుంఠపురములో సినిమా యుఎస్‌లో ట్రెండ్ అవుతుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 10, 2020, 12:27 PM IST