Allu Arjun: సుకుమార్ తో అల్లుఅర్జున్ మరో ప్రాజెక్టు.. ఆ వివరాలివే..

Allu Arjun

Allu Arjun-Arya 3: పుష్ప సినిమా షూటింగ్ శరవేంగా పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు.

  • Share this:
    పుష్ప సినిమా షూటింగ్ శరవేంగా పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడిచేయనున్నారు. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ చిత్రమంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. వీరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' కోసం బన్నీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగం డిసెంబరు 17న విడుదలకానుంది. దర్శకుడు సుకుమార్‌, నటుడు అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి ఎంతో క్రేజ్‌ ఉంది.

    Pushpa - Allu Arjun : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ నుంచి మరో అప్‌డేట్.. అదిరిన సిద్ గానం..


    ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప సినిమా కు సంబంధించి రెండో సాంగ్ కూడా ప్రోమో వచ్చింది. ఇది ప్రతీ ఒక్కరినీ అలరిస్తోంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తో సుకుమార్ ఆర్య, ఆర్య 2 సినిమాలను రూపొందించిన సుకుమార్ పుష్ఫ తర్వాత ఆర్య3 ని తెరకెక్కించనున్నారు. ఇటీవల లైవ్ చాట్‌లో సుకుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పుష్ప వాయిదా పడే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై సుకుమార్ స్పందించారు.

    Samantha-Nagachaitanya: సమంతకు నాగచైతన్య అంటే ఇంత ఇష్టమా.. మరెందుకు ఇలా అయింది..


    ఈ సినిమా అనుకున్న విధంగానే డిసెంబర్ 17న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా పుష్ప పార్టు 2 తర్వాత "ఆర్య 3" కూడా మొదలు కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు సుకుమార్. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధమవుతోందని, త్వరలోనే అప్‌డేట్ చెబుతానని సుకుమార్ తెలిపారు. ఆర్య3లో బన్నీ విభిన్న లుక్ లో కనిపిస్తాడని టాక్.  'పుష్ప-2' షూట్ పూర్తికాగానే కాస్త గ్యాప్ ఇచ్చి 'ఆర్య-3' ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రంలో బన్నీ సరసన ఎవరు నటిస్తారనే వివరాలేవీ తెలియరాలేదు.
    Published by:Veera Babu
    First published: