Home /News /movies /

GOOD MOVIE IS ALWAYS WINNER MAHESH BABU ABOUT MAHARSHI MOVIE READ STORY HERE MNJ

Mahesh Babu- Maharshi: మంచి సినిమా ఎప్ప‌టికీ విజేత‌గానే నిలుస్తుంది.. 'మహర్షి' గురించి మ‌హేష్ తాజా స్పందన

మహేష్ బాబు (Twitter/Photo)

మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu- Maharshi: 2019 సంవ‌త్స‌రానికి గానూ 67వ జాతీయ అవార్డు విజేత‌ల‌ను గ‌త వారం ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు స‌త్తా చాటాయి. ముఖ్యంగా మహేష్ బాబు మ‌హ‌ర్షి, నాని జెర్సీ సినిమాలు అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. మ‌హ‌ర్షికి మూడు, జెర్సీకి రెండు జాతీయ అవార్డులు వ‌చ్చాయి.

ఇంకా చదవండి ...
    Mahesh Babu- Maharshi: 2019 సంవ‌త్స‌రానికి గానూ 67వ జాతీయ అవార్డు విజేత‌ల‌ను గ‌త వారం ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు స‌త్తా చాటాయి. ముఖ్యంగా మహేష్ బాబు మ‌హ‌ర్షి, నాని జెర్సీ సినిమాలు అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. మ‌హ‌ర్షికి మూడు, జెర్సీకి రెండు జాతీయ అవార్డులు వ‌చ్చాయి. ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం, బెస్ట్ కొరియోగ్రఫీ, ఉత్త‌మ నిర్మాణ సంస్థ విభాగంలో మ‌హ‌ర్షికి అవార్డులు రాగా.. ఉత్త‌మ తెలుగు చిత్రం, బెస్ట్ ఎడిట‌ర్ విభాగంలో జెర్సీకి అవార్డులు వ‌చ్చాయి. కాగా మ‌హ‌ర్షి సినిమాకు అవార్డులు రావ‌డంతో అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో సంతోషాన్ని వ్య‌క్తం చేసిన మ‌హేష్ బాబు.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై స్పందించారు. మంచి సినిమా ఎప్ప‌టికీ విజేత‌గానే నిలుస్తుంద‌ని, అందుకు మ‌హ‌ర్షికి కూడా అన్ని అర్హ‌తలు ఉన్నాయ‌ని తాను భావిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇక ఇంత‌టి మంచి సినిమాను తీర్చిదిద్దిన వంశీ పైడిప‌ల్లికి థ్యాంక్స్ అని చెప్పారు.

    ఇప్ప‌టికే మీకు ఎన్నో అవార్డులు వ‌చ్చాయి క‌దా అవి మీకు ముఖ్య‌మా అన్న ప్ర‌శ్న‌కు.. క‌చ్చితంగా. అవార్డులు వ‌చ్చిన‌ప్పుడే ఆ సినిమా గురించి ప్ర‌పంచానికి తెలుస్తుంది అని మ‌హేష్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు తాను స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాన‌ని.. ఈ సినిమా షూటింగ్‌ను తాజా చాలా ఎంజాయ్ చేస్తున్నాన‌ని మ‌హేష్ పేర్కొన్నారు.




    ఇదిలా ఉంటే ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా స‌ర్కారు వారి తెర‌కెక్కుతోంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్,14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మ‌హేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ ఎంట‌ర్‌టైన‌ర్‌కు సంగీతాన్ని అందిస్తున్నాడు. గీత గోవిందం చిత్రం త‌రువాత ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై అటు మ‌హేష్ బాబు అభిమానుల‌తో పాటు ఇటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ త‌రువాత మ‌హేష్ ఓ బాలీవుడ్ మూవీలో న‌టించ‌నున్నార‌ని, ఆ ప్రాజెక్ట్ త‌రువాత రాజ‌మౌళి- మ‌హేష్ కాంబినేష‌న్‌లో సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.
    Published by:Manjula S
    First published:

    Tags: Maharshi, Mahesh babu

    తదుపరి వార్తలు