హోమ్ /వార్తలు /సినిమా /

NTR : ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ శుభ సమయం రానే వచ్చింది...

NTR : ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ శుభ సమయం రానే వచ్చింది...

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలను చేస్తూనే.. మరోపక్క టీవీల్లో ఓ కూడా అలరించడానికి రెడీ అయ్యారు.

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలను చేస్తూనే.. మరోపక్క టీవీల్లో ఓ కూడా అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హోస్ట్‌గా జెమినీ టీవీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ గేమ్ షో రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో వస్తున్న ఈ షో సంబంధించి ఇటీవల ఓ ప్రోమో విడుదలవ్వగా.. ప్రసారంపై అభిమానులకు అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది. ఎప్పుడు తమ అభిమాన నటుడిని చిన్న తెరపై చూస్తాము అని.. అయితే ఆ ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుంది. ఈ షో ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఇక మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని అంటున్నారు. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ గెస్టుగా రాబోతున్నారని.. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా జరిగిందని అంటున్నారు. ఇక షోపై హైప్ పెంచేందుకు త్వరలోనే ప్రోమో కూడా విడుదల చేసే పనిలో ఉందట టీమ్. గతంలో ఇదే షోను నాగార్జున, చిరంజీవి హోస్ట్’గా వ్యవహరించారు. అయితే అప్పుడు ఈ  షో మాటీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రసారం అయ్యేది.  దాన్ని కొద్దిగా మార్చారు. ఇక గతంలో కూడా ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహారించి అదరగొట్టిన సంగతి తెలిసిందే.


  ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తర్వత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ధృవీకరించారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సలార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Jr ntr, Tollywood news

  ఉత్తమ కథలు