నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు

Gollapudi Maruti Rao : గొల్లపూడి మారుతీరావు మృతిని సినీ ప్రముఖులు, అభిమానులూ తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

news18-telugu
Updated: December 15, 2019, 6:52 AM IST
నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు
నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు
  • Share this:
Gollapudi Maruti Rao : తిరుగులేని రచయిత, భాషా ప్రావీణుడు, ప్రముఖ నటుడు, సాహితీ వేత్త అయిన గొల్లపూడి మారుతీరావు మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన గురువారం కన్నుమూశారు. ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలను ఆదివారం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందువల్ల శనివారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి మార్చురీలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భౌతికకాయాన్ని... చెన్నైలోని... టి.నగర్‌ శారదాంబాళ్‌ వీధిలోని ఆయన ఇంటికి తీసుకొచ్చి... ప్రజల సందర్శన కోసం ఉంచారు. నటులు భానుచందర్‌, చిరంజీవి, సుహాసిని, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రాజీవ్‌మేనన్‌, సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ మురారి, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఇంకా చాలా మంది గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభుల్ని పరామర్శిస్తూ... గొల్లపూడితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నేటి ఉదయం 11 గంటలకు చెన్నైలోని... టి.నగర్‌ కన్నమ్మపేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నారు.

విజయనరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు... విశాఖపట్నంలో వృత్తిని ప్రారంభించి కళామతల్లి సేవలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఆయన మొదటిసారిగా స్క్రీన్‌ప్లే అందించిన ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రంతో తొలి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు. తన సినీ జీవితంలో ఆరు నంది పురస్కారాలు అందుకున్నారు. దాదాపు 80 సినిమాలకు రచయితగా, 290 సినిమాలకు నటుడిగా గొల్లపూడి సాగించిన ప్రస్థానం ఎప్పటికీ మర్చిపోలేనిదని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

 

Pics : అందం, అభినయానికి కేరాఫ్ విద్యా ప్రదీప్


ఇవి కూడా చదవండి :

 ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం

IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

Health : ఒరెగానో వాడుతున్నారా... కిచెన్‌లో ఇది ఉంటే ఆరోగ్యమే

Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు