Prabhas - Shruti Haasan: శ్రుతి హాసన్‌కు లక్కీ ఛాన్స్‌.. ప్రభాస్‌ జోడీగా చెన్నై బ్యూటీ

golden oppurtunity to Shruti haasan and she pair up Prabhas in Salaar

Prabhas - Shruti Haasan: కెరీర్‌ ప్రారంభం నుండి దక్షిణాది, ఉత్తరాది సినిమాలు చేస్తూ వచ్చిన శ్రుతిహాసన్‌ కిట్టిలోకి ఓ గోల్డెన్‌ ఆపర్చ్యునిటీ వచ్చింది. ఇంతకీ ఏంటా అవకాశం అంటే.. ప్యాన్‌ ఇండియా క్రేజీ మూవీగా తెరకెక్కనున్న సలార్‌ మూవీలో ప్రభాస్‌ జోడీగా శ్రుతి హాసన్‌ నటించబోతుందట.

  • Share this:
    ప్రేమ పాఠాలతో సినీ పరిశ్రమకు దూరమైన స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌కు లవ్‌ బ్రేకప్‌ తర్వాత మబ్బులు వీడిపోయాయి. మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా విడుదలైన క్రాక్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ కావడంతో అందరి దృష్టి శ్రుతి హాసన్‌పై పడింది. ప్యాన్‌ ఇండియా సినీ ప్రేక్షకుడికి శ్రుతి హాసన్‌ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. కెరీర్‌ ప్రారంభం నుండి దక్షిణాది, ఉత్తరాది సినిమాలు చేస్తూ వచ్చిన శ్రుతిహాసన్‌ కిట్టిలోకి ఓ గోల్డెన్‌ ఆపర్చ్యునిటీ వచ్చింది. ఇంతకీ ఏంటా అవకాశం అంటే.. ప్యాన్‌ ఇండియా క్రేజీ మూవీగా తెరకెక్కనున్న సలార్‌ మూవీలో ప్రభాస్‌ జోడీగా శ్రుతి హాసన్‌ నటించబోతుందట. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు సలార్‌లో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా శ్రుతి హాసన్‌ పేరు పరిశీలనలోకి వచ్చింది. శ్రుతి హాసన్‌కు ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు ఉండటంతో పాటు, రెమ్యునరేషన్‌ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండదని భావించడంతో నిర్మాతలు శ్రుతి వైపుకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.

    ఇప్పుడు 'రాధేశ్యామ్‌'ను పూర్తి చేస్తున్న ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీ 'సలార్‌' కోసం రెడీ అయిపోయారు. 'సలార్‌' రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం అవుతుంది. అక్క‌డి నుంచి కంటిన్యూగా స‌మ్మ‌ర్ వ‌ర‌కు షూటింగ్ చేస్తాడ‌ట‌. మార్చిలో చిన్న బ్రేక్, త‌ర్వాత స‌మ్మ‌ర్‌లో ఓ చిన్న బేక్ తీసుకుంటాడ‌ట‌. అదే స‌మ‌యంలో ప్ర‌శాంత్ నీల్ కూడా త‌న కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2 సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా మారుతాడు. త‌ర్వాత మొద‌లు పెట్టి జూలై కంతా పూర్తి చేయాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడ‌ట‌.

    ఆ వెంటనే ప్ర‌భాస్‌, ఓం రావుత్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘ఆదిపురుష్‌’ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించాల‌నేది ప్ర‌భాస్ ఆలోచ‌న‌. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుంటే, రావ‌ణాసురుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
    Published by:Anil
    First published: