బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న షోలలో ఒకటి బిగ్ బాస్ (Bigg Boss). తెలుగు, హిందీతో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు బుల్లితెర ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. సీజన్ బై సీజన్ ఈ షోకి రెట్టింపు స్పందన వస్తుండటం చూస్తున్నాం. సెలబ్రిటీలందరినీ ఒకేచోట చూసే అవకాశంతో పాటు వారి వారి ఆట, పాట, ఎంజాయ్ మూమెంట్స్ అన్నీ చూసే అవకాశం కలిపిస్తున్న ఈ షో తెలుగులో ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లు పూర్తి చేసుకుంది. వరుసగా ఈ ఐదు సీజన్లు సూపర్ హిట్ కావడంతో ఆరో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పట్లు మొదలుపెట్టినట్లు టాక్. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ (Bigg Boss Host) నాగార్జున (Akkineni Nagarjuna) తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ రీసెంట్గా ఐదో సీజన్ పూర్తి కావడంతో ఆరో సీజన్ ఎలా ఉండబోతోంది? కంటిస్టెంట్స్ ఎవరెవరు ఉంటారు? అనే దానిపై జనాల్లో అప్పుడే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇందులో యాంకర్ శివ, శ్రీరాపాక వంటి కంటిస్టెంట్స్ సందడి చూడబోతున్నామనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కామన్ మ్యాన్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టొచ్చు అంటూ తాజాగా వదిలిన వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పటిదాకా బయట ఉండి ఓట్లు వేస్తూ తమకు నచ్చిన కంటిస్టెంట్లను ఎంకరేజ్ చేసిన సాధారణ పబ్లిక్ కోసం ఈ సారి బిగ్ బాస్ టీమ్ ఈ సారి ఓ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. బిగ్‌బాస్ ఆరో సీజన్లో సామాన్యులు కూడా పాల్గొనేలా షో నిర్వాహకులు ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్- 6లో కామన్ మ్యాన్ కూడా పాల్గొనొచ్చు అని చెబుతూ ఓ వీడియో వదిలారు. ''ఇన్నాళ్లు మీరంతా బిగ్ బాస్ షో చూశారు, ఆనందించారు. మీరు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకుంటున్నారు కదూ.. అందుకే స్టార్ మా ఇస్తుంది ఆకాశాన్ని అందుకునే అవకాశం. వన్ టైమ్ గోల్డోన్ ఆఫర్. టికెట్ టు బిగ్‌బాస్ సీజన్ 6'' అంటూ ఈ వీడియోలో నాగార్జున చెప్పారు.
#StarMaamusic #tickettoBB6 One time golden opportunity to grab Ticket to BB 6.
Samanyulaki ahvanam pic.twitter.com/8wLd4pZ51L
— starmaa (@StarMaa) May 26, 2022
ఈ గోల్డెన్ ఛాన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్టార్ మా వారి వెబ్‌సైట్‌కి లాగిన్ అవండి అని చెబుతూ starmaa.startv.com ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి అని పేర్కొన్నారు. ఈ లింక్‌ను క్లిక్ చేసి మీ పేరు, అడ్రస్, కాంటాక్ట్ నంబర్ తదితర వివరాలు ఇచ్చాక మీ గురించి ఆసక్తికర విషయాలను ఎంటర్ చేయాలి. అలాగే మీ టాలెంట్ రిప్రెజెంట్ అయ్యేలా 3 నిమిషాల ఓ వీడియో తీసి అప్లోడ్ చెయ్యాలి. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకొని హౌస్ లోకి ఎంటర్ అవండి మరి!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Bigg Boss, Bigg Boss 5, బిగ్ బాస్