హోమ్ /వార్తలు /సినిమా /

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ మరో అరుదైన రికార్డ్.. నాటు పాటకు గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డు..!

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ మరో అరుదైన రికార్డ్.. నాటు పాటకు గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డు..!

నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్‌లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును కీరవాణి అందుకున్నాడు. ఓ ఇండియన్ సినిమాకు ఈ అవర్డు దక్కడం ఇదే తొలిసారి.

అవార్డు ప్రకటించగానే.. ఒక్కసారిగా అక్కడ ఉన్నఆర్ఆర్ఆర్ టీం అంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంది. రామ్ చరణ్ , కీరవాణి, ఎన్టీఆర్ , రాజమౌళితమ భార్యలతో కలిసి ఈ వేడుకకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ఫంక్షన్‌లో ఆర్ఆర్ఆర్ టీం చేసిన సందడికి అంతా చప్పట్లు కొట్టారు. అవార్డు ప్రకటించగానే.. కీరవాణి వెళ్లి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.

First published:

Tags: Jr ntr, M. M. Keeravani, Rajamouli, Ramcharan, RRR

ఉత్తమ కథలు