మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (God father)సినిమా టీజర్(Teaser)రిలీజ్ అయింది. సుప్రీం హీరో బర్త్ డే గిఫ్ట్(Birthday gift)గా రిలీజ్ చేసిన టీజర్లో చిరంజీవి గెటప్, మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైలాగ్, యాక్షన్, డైలాగ్‌లతో కూడిన ఒక నిమిషం 30సెక్‌లు కలిగిన టీజర్లో బాలీవుడ్ (Bollywood)కండలవీరుడు సల్మాన్‌ఖాన్(Salman Khan)కూడా కనిపించడంతో గాడ్‌ఫాదర్ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ (Viral)అవుతోంది. మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా మలయాళంలో హిట్టైన లూసిఫర్ మూవీని రీమేక్ చేశారు. తెలుగులో ఈ మూవీ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి.
గాడ్‌ఫాదర్ టీజర్ అదుర్స్ ..
మెగాస్టార్ చిరంజీవి కుషిలో ఉన్నారు. సుప్రీం హీరో అప్‌కమింగ్ మూవీ ‘గాడ్ ఫాదర్’టీజర్ రిలీజైంది. చిరు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈసినిమా టీజర్‌ని విడుదల చేశారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్ మూవీని తెలుగులో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈసినిమా టీజర్‌ని చిరంజీవి పుట్టిన రోజుకు ఒక రోజు ముందు విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి లుక్, కాస్ట్యూమ్స్ కేక పుట్టిస్తున్నాయి. చిరు తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు.
చిరు గెటప్‌కి ఫ్యాన్స్ ఫిదా..
గాడ్‌ఫాదర్ టీజర్ బిగినింగ్ నటుడు మురళిశర్మ వాయిస్‌ఓవర్‌తో క్యూరియాసిటీ పెంచింది. 20ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో తెలియదు కాని ..వచ్చిన ఆరేళ్లలోనే జనంలో మంచి పాపులారిటీ సంపాధించుకున్నాడనే వాయిస్‌కి జాతీయ జెండా, మహిళలు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న విజువల్స్ టీజర్‌కి హైప్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. ఏదో ధ్యానం చేస్తున్నట్లుగా ఉండే నయనతార ఇక్కడికి ఎవరొచ్చినా పర్వాలేదు కాని ..అతను మాత్రం రావొద్దని చెప్పడంతో హీరో ఎంట్రీ సీన్ టీజర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. సత్యదేవ్, జయరామ్ క్యారెక్టర్లకు సంబంధించిన వీడియోతో పాటు ఆయన మాస్‌కి బాస్ అంటూ వచ్చిన డైలాగ్‌తో టీజర్ కేక పుట్టించే విధంగా ఉంది. రిలీజైన గంటలోపే టీజర్‌కి రెండున్నర లక్షణ వ్యూస్ వచ్చాయి.
ఊర మాస్ స్టైల్లో ..
గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవి సీరియస్ క్యారెక్టర్లో కనిపించారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను చిరు ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవికి తమ్ముడ్ని అన్నట్లుగా ఉండే క్యారెక్టర్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సైతం ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇద్దరూ కలిసి జీప్‌లో ఉన్న షాట్‌తో టీజర్ క్లోజవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 5వ తేదిన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈసినిమాని సూపర్‌గుడ్ ఫిలిమ్స్, శ్రీకొణిదెల ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: God Father Movie, Megastar Chiranjeevi, Tollywood actor