హోమ్ /వార్తలు /సినిమా /

God Father Movie Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ.. మెగాస్టార్ పొలిటికల్ యాక్షన్ అదుర్స్..!

గాడ్ ఫాదర్ (God Father)
గాడ్ ఫాదర్ (God Father)
3/5
రిలీజ్ తేదీ:5/10/2022
దర్శకుడు : మోహన్ రాజా (Mohan Raja)
సంగీతం : తమన్ (Thaman)
నటీనటులు : చిరంజీవి,సల్మాన్ ఖాన్, నయనతారా, సత్యదేవ్, పూరీ జగన్నాథ్,మురళీ శర్మ, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ, తదితరులు..
సినిమా శైలి : పొలిటికల్ యాక్షన్ డ్రామా
సినిమా నిడివి : 2 Hr 32 M

God Father Movie Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ.. మెగాస్టార్ పొలిటికల్ యాక్షన్ అదుర్స్..!

 God Father Movie Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ..

God Father Movie Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ..

God Father Movie Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విజయ దశమి కానుకగా ఈ రోజు భారీ ఎత్తున విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవిని విజయం వరించిందా లేదా అన్నది మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రివ్యూ : గాడ్ ఫాదర్ (God Father)

  నటీనటులు : చిరంజీవి,సల్మాన్ ఖాన్, నయనతారా, సత్యదేవ్, పూరీ జగన్నాథ్,మురళీ శర్మ, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ, తదితరులు..

  ఎడిటర్: మార్తాండ్ కే. వెంకటేష్

  సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

  సంగీతం: ఎస్.ఎస్. తమన్

  నిర్మాత : రామ్ చరణ్, ఆర్.బీ.చౌదరి, ఎన్.వి.ప్రసాద్

  దర్శకత్వం: మోహన్ రాజా

  విడుదల తేది : 05/10/2022

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విజయ దశమి కానుకగా ఈ రోజు భారీ ఎత్తున విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి విజయం అందుకున్నారా లేదా  మన మూవీ రివ్యూలో చూద్దాం..

  కథ 

  కథ విషయానికొస్తే.. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి హాఠాన్మరణంతో సీఎం ప్రాతినిథ్యం వహించే జన జాగృతి పార్టీని పార్టీలోని వారందరు కన్నేస్తారు. ఈ నేపథ్యంలో సీఎం పీఠంపై  సీఎం అల్లుడు జై దేవ్ (సత్యదేవ్) కన్నేస్తాడు. ఈ నేపథ్యంలో జన జాగృతి పార్టీని కాపాడే క్రమంలో బ్రహ్మా (గాడ్ ఫాదర్) ఎంట్రీ ఇస్తాడు.తన చెల్లెలు సత్యదేవ్ జయప్రియ(నయనతార)కు అండగా నిలుస్తాడు. గాడ్ ఫాదర్ ఎంట్రీతో జన జాగృతి పార్టీలో జరిగిన పరిణామాలు.. సీఎం పీఠం కోసం వేసే ఎత్తుకు పై ఎత్తులు వేసే క్రమంలో జరిగిన పరిణామాలే ‘గాడ్ ఫాదర్’ ఎలా పై చేయి సాధించాడనేది ఈ సినిమా స్టోరీ.

  కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే.. 

  దర్శకుడు మోహన్ రాజా.. ఆల్రెడీ మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో తెరకెక్కించారు. ఆల్రెడీ మల్లూవుడ్‌లో  హిట్టైన ఈ సినిమాను  తెలుగులో అదే ‘లూసీఫర్’ టైటిల్‌తో  డబ్బింగ్  చేయబడింది.  ఇప్పటికే ప్రజలందరు చూసేసిన ఈ సినిమాను మోహన్ రాజా రీమేక్ చేయడం అనేది ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. అయితే మోహన్ రాజ గాడ్ ఫాదర్ టేకింగ్‌ చాలా బావుందంటున్నారు ప్రేక్షకులు.

  నటీనటుల విషయానికొస్తే.. 

  దసరా కానుకగా థియేరట్లలో విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో రిలీజ్ అయిన లూసిఫర్ సినిమాకు ఇది రిమేక్. ఆ సినిమా చూడని వాళ్లకు గాడ్ ఫాదర్ మరింత నచ్చుతుంది. మెగాస్టార్ రాకింగ్ ఫెర్‌ఫామెన్స్ ఇచ్చారు. ఇక సత్యదేవ్ తన పాత్రకు ఫెర్‌ఫక్ట్‌గా రోల్ చేశారు. సత్యదేవ్ విలన్ పాత్రలో సూపర్ అనిపించాడు. ఇక తెలుగులో దర్శకుడు మోహన్ రాజ హనుమాన్  జంక్షన్ తర్వాత  22 ఏళ్లకు గాడ్ ఫాదర్ సినిమా తీశాడు.

  ఇక మోహన్ రాజ టేకింగ్ అదుర్స్ అనిపించింది. గాడ్ ఫాదర్ తెర వెనుక మరో హీరో తమన్ అనే చెప్పాలి. సినిమాలో ప్రతీ సన్నివేశంకు  తమన్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది. గాడ్ ఫాదర్ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటూ నిన్నటి నుంచి హాట్ టాపిక్‌ నడుస్తుంది. ఇక సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటర్వెల్ ఎంట్రీ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ బౌన్స్ అయ్యాడు. మురళీ మోహన్, సర్వదమన్ బెనర్జీ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. నయనతార పాత్ర కూడా ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ పాత్ర ఉన్నంతలో బాగానే క్రియేట్ చేశారు. ఇక రాజకీయ నాయకుడిగా మురళీ శర్మ తన పాత్రలో అద్బుతంగా నటించారు. బ్రహ్మాజీ పాత్ర కూడా బావుంది. ఇక జర్నలిస్ట్ పాత్రలో పూరి జగన్నాథ్ కూడా కేక పెట్టించారు.

  ప్లస్ పాయింట్స్:

  మెగాస్టార్ చిరంజీవి నటన

  తమన్ మ్యూజిక్

  మోహన్ రాజ టేకిింగ్

  కెమెరా వర్క్

  మైనస్ పాయిట్స్

  లూసిఫర్ చూసినవాళ్లకు కనెక్ట్ కాదు

  సీరియస్‌గా సాగే కథనం

  సల్మాన్ ఖాన్ పాత్ర ఎఫెక్టివ్‌గా లేదు

  క్లైమాక్స్ సాంగ్‌లో చిరంజీవి పాట

  చివరి మాట : గాడ్ ఫాదర్ ‘ఓన్లీ ఫర్ మెగా ఫ్యాన్స్’

  రేటింగ్..3/5

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  రేటింగ్

  కథ:
  3/5
  స్క్రీన్ ప్లే:
  3/5
  దర్శకత్వం:
  3/5
  సంగీతం:
  3.5/5

  Tags: Bollywood news, Chiranjeevi, God Father Movie, God Father Movie Review, Nayanthara, Salman khan, Tollywood

  ఉత్తమ కథలు