హోమ్ /వార్తలు /సినిమా /

God Father: గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల.. ‘తార్ మార్ తక్కర్ మార్’ అంటూ చిరు, సల్మాన్ సందడి..

God Father: గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల.. ‘తార్ మార్ తక్కర్ మార్’ అంటూ చిరు, సల్మాన్ సందడి..

‘గాడ్ ఫాదర్’ మూవీ ‘తార్ మార్ తక్కర్ మార్’ ప్రోమో విడుదల (Twitter/Photo)

‘గాడ్ ఫాదర్’ మూవీ ‘తార్ మార్ తక్కర్ మార్’ ప్రోమో విడుదల (Twitter/Photo)

చిరంజీవి లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి లుక్ రఫ్‌లుక్‌తో కేక పుట్టిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Chiranjeevi - Salman Khan - God Father First Single :  మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ (Lucifer) రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ (God Father )టైటిల్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేసారు. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.

  ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, చిరంజీవి  స్పెషల్ సాంగ్‌ ఉంది.  ఈ సాంగ్‌ను తాజాగా విడుదల చేసారు. ఈ పాటలో చిరంజీవితో సల్లూ భాయ్ చేసిన డాన్స్ మూమెంట్స్ ఆడియన్స్‌కు కిక్ ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు ప్రోమోలో చెప్పారు.

  గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో నటించారు.  మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో కనిపంచబోతున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమా సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు అపుడే లెక్కలు వేసుకుంటున్నారు.

  ఇక ‘గాడ్ ఫాదర్’ మూవీలో  ముందుగా  సల్మాన్ ఖాన్ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేయించారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు.

  Mahesh Babu 29 - Rajamouli: మహేష్ బాబుతో చేయబోయే మూవీ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో సత్యదేవ్ నటించారు.  ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో నయనతార యాక్ట్ చేసింది  ఇక ఈ చిత్రంలో   సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరోవైపు చిరు., బాబీ  దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు  చిరంజీవి.. వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. అటు మారుతి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు ‘పక్కా కమర్షియల్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చెప్పారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Chiranjeevi, God Father Movie, Salman khan, Tollywood

  ఉత్తమ కథలు