హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas | Unstoppable: ప్రభాస్ చెప్పిన సింగిల్‌ డైలాగ్‌తో వైరల్ అవుతున్న అన్‌స్టాపబుల్‌ గ్లింప్స్ ..వీడియో ఇదిగో

Prabhas | Unstoppable: ప్రభాస్ చెప్పిన సింగిల్‌ డైలాగ్‌తో వైరల్ అవుతున్న అన్‌స్టాపబుల్‌ గ్లింప్స్ ..వీడియో ఇదిగో

PRABHAS(Photo:Instagram)

PRABHAS(Photo:Instagram)

Prabhas | Unstoppable: బాహుబలి ప్రభాస్ మీట్ విత్ బాలయ్య పేరుతో అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2లో ఓ టాక్‌ షోకి వేదికైంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా..డార్లింగ్ ప్రభాస్ గెస్ట్‌గా సాగిన ఈ ఎపిసోడ్‌ కోసం ప్రభాస్ ఏం డైలాగ్ చెప్పాడో చూడండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రేర్ కాంబినేషన్‌ సినిమాల్లోనే కాదు..టాక్‌ షోల్లో కూడా ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2లో ఈసారి ప్రేక్షకులు డార్లింగ్ అని పిలుపుచుకునే బాహుబలి ప్రభాస్ గెస్ట్‌గా అప్పియరెన్స్ ఇచ్చాడు. ఈ షోలో ప్రభాస్(Prabhas)ఫ్రెండ్ హీరో గోపిచంద్‌ (Gopichand)ని కూడా ఇంటర్వూ చేశారు బాలయ్య(Balakrishna). ఈ రేర్‌ కాంబినేషన్‌ని ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్(Unstoppable show)ప్రోగ్రామ్‌ ద్వారా ఆడియన్స్‌ని ఉత్తేజపరుస్తోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రభాస్‌ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా ..తాజాగా ప్రోగ్రామ్‌కి సంబంధించిన గ్లింప్స్‌ (Glimpse)ఇప్పుడు తెగ వైరల్ (Viral)అవుతోంది.

Rashmika Mandana: గోల్డ్‌ కలర్ డ్రెస్‌లో అందాల రాక్షసి .. వైరల్ అవుతున్న రష్మిక మందనా న్యూపిక్స్

గ్లింప్స్‌తో పెరిగిన క్రేజ్ ..

బాహుబలి ప్రభాస్ మీట్ విత్ బాలయ్య పేరుతో అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2లో ఓ టాక్‌ షోకి వేదికైంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా..డార్లింగ్ ప్రభాస్ గెస్ట్‌గా సాగిన ఈ ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే టైమ్‌లో ఆహా ఓటీటీ ..ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్‌ని ఆహ్వానించగానే క్రాకర్స్‌తో కూడిన స్పార్క్స్‌ లైటింగ్‌లో ప్రభాస్ వస్తుండగా ఆడియన్స్ ఈలలు, గోలలు చేయడం అద్భుతంగా ఉంది. రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్‌కే నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

బాహుబలి విత్ బాలయ్య..

టాక్‌ షోలు చాలా మంది హీరోలు చేశారు. కాని ప్రెస్‌మీట్‌లు, మీడియాకి దూరంగా ఉండే నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ హీరో అన్‌స్టాపబుల్‌ అనే టాక్‌ షో చేయడం..దానికి గెస్ట్‌గా సైలెంట్‌గా ఉంటూ సూపర్,డూపర్‌ హిట్ సినిమాలో హ్యూజ్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాధించుకున్న ప్రభాస్‌ లాంటి ఆరు అడుగుల బుల్లెట్ షోకి రావడంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు.

డార్లింగ్ ఫ్యాన్‌ ఫాలోయింగ్..

బాహుబలి మీట్ బాలయ్య అంటూ చేసిన ప్రోమో కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ చూసిన డార్లింగ్ అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ..ఈ ప్రోగ్రామ్ అఖండం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో గోపిచంద్‌ కూడా పార్టిసిపేట్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. బాలకృష్ణ ప్రభాస్‌కి సంబంధించిన వివరాలు గోపిచంద్ ద్వారా చెప్పించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రభాస్ రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్ అంటూ డైలాగ్‌ని కట్ చేశారు.

First published:

Tags: Prabhas, Tollywood actor, Unstoppable NBK

ఉత్తమ కథలు