Naya Rivera : లేకులో గల్లంతైన నయా రివెరా.. కొనసాగుతున్న వెతుకులాట..

Naya Rivera : అమెరికన్ పాపులర్ మ్యూజికల్ కామెడీ షో 'గ్లీ' స్టార్ నయా రివెరా లాస్ ఎంజెల్స్‌లోని ఓ లేకులో మునిగి మరణించినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 9, 2020, 3:24 PM IST
Naya Rivera : లేకులో గల్లంతైన నయా రివెరా.. కొనసాగుతున్న వెతుకులాట..
నయా రివెరా.. Photo : Twitter
  • Share this:
Naya Rivera : అమెరికన్ పాపులర్ మ్యూజికల్ కామెడీ షో 'గ్లీ' (glee) స్టార్ నయా రివెరా లాస్ ఎంజెల్స్‌లోని ఓ లేకులో మునిగి మరణించినట్లు తెలుస్తోంది. లాస్ ఎంజెల్స్ పోలీసుల సమాచారం మేరకు బుధవారం ఆమె కాలిఫోర్నియా లేకులో విహరించడానికి ఓ బోట్‌ను అద్దేకు తీసుకుని తన తన నాలుగేళ్ల కుమారునితో షికారుకు వెళ్లినట్లు సమాచారం. లేకులో షికారుకెళ్లిన వారు తిరిగి రాక పోవడంతో అక్కిడి స్థానిక సిబ్బంది వారి కోసం ఆ లేకులో వెతికే ప్రయత్నం చేశారని అయితే ఇంతవరకూ ఆచూకి దొరకలేదని స్థానిక వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. నటి రివెరా, గ్లీ కామెడీ షోలో హైస్కూల్ చీర్ లీడర్‌.. సంతాన లోపెజ్ పాత్రలో నటించి చాలా పాపులర్ అయ్యింది. ఈ షో అక్కడ ఆరు సంవత్సరాలు ప్రసారం అయ్యింది. ఇక నటుడు రియాన్ డోర్సేతో 2018లో విడాకులు తీసుకున్నా రివెరా ప్రస్తుతం తన కుమారుడితో ఒంటరిగా ఉంటోంది.

చివరి సారిగా ఆమె తన కొడుకుతో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ మీ ఇద్దరమే అంటూ.. రాసుకుంది. అయితే ఈ వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, నెటిజన్స్ ఆమె ట్విట్టర్ వాల్‌పై ఆమె సురక్షితంగా తిరిగిరావాలనీ ప్రార్థిస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: July 9, 2020, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading