అదృశ్యమైన నటి.. ఐదు రోజుల తర్వాత నదిలో శవమై తేలింది..

Glee Star Naya Rivera | గత ఐదు రోజులుగా ఎవరికీ కనిపించకుండా పోయిన ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా ఓ నదిలో శవమై కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: July 14, 2020, 12:02 PM IST
అదృశ్యమైన నటి.. ఐదు రోజుల తర్వాత నదిలో శవమై తేలింది..
ప్రముఖ నటి కన్నమూత (Instagram/Photo)
  • Share this:
గత ఐదు రోజులుగా ఎవరికీ కనిపించకుండా పోయిన ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా ఓ నదిలో శవమై కనిపించడం హాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె మృత దేహాన్ని పోలీసులు పెరూలేక్‌లో గుర్తించారు. ‘గ్లీ’ చిత్రంతో పాపులర్ అయింది నయా రివీరా. ఐదు రోజుల క్రితం ఆమె పెరూ లెేక్‌లో ఓ బోట్‌ను రెంట్‌కు తీసుకొని తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి బోటు షికారుకు వెళ్లింది రివీరా. ఐతే.. అనుకున్న సమయానికి ఆమె వెళ్లిన బోట్ తిరిగిరాలేదు. దీంతో బోటు యాజమాని పోలీసులతో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌కు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. దీంతో ఈమె ప్రయాణించిన బోటును ఎట్టకేలకు పట్టుకోగలిగారు పోలీసులు. ఆ బోటులో రివీరా  కుమారుడు పడుకొని ఉన్నాడు. ఆ పిల్లాడి పక్కన ఓ లైఫ్ జాకెట్‌తో పాటు ఆమె మనీ పర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో ఆ బాలుడు మాట్లాడుతూ.. అమ్మ నేను ఈత కొట్టాడానికి వెళ్లాం. నేను తిరిగి వచ్చాను. కానీ అమ్మ ఇంకా తిరిగి రాలేదని చెప్పాడు.

Glee Star Naya Rivera Found Dead At California Lake Five Days After Disappearance,Glee Star Naya Rivera,Glee Star Naya Rivera died,Glee Star Naya Rivera dead,glee star naya rivera,hollywood,bollywood,నయా రివేరా,నయా రివేరా మృతి,హాలీవుడ్ నటి మృతి,హాలీవుడ్ నటి అదృశ్యం,శవమై తేలిన గ్లీ స్టార్ నయా రివీరా,చనిపోయిన నయా రివేరా,మృతి చెందిన నయా రివేరా
ప్రముఖ నటి నయా రివేరా కన్నమూత (Instagram/Photo)


దాంతో రివీరా ఏమైనా సూసైడ్ చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పాటు ఆమె మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.దాదాపు ఐదు రోజుల పాటు పెరూలేక్‌ను జల్లెడ పట్టిన పోలీసులకు చివరకు నిన్న సాయంత్రం రివీరా మృత దేహాన్ని కనుగొన్నారు. రివీరా విషయానికొస్తే.. ఈమె ఫాక్స్ మ్యూజికల్ కామెడీ చిత్రం ‘గ్లీ’ ఆరు సీజన్‌లతో రివీరా పాటలు పాడే చీర్ లీడర్ సంటానా లోపెజ్ పాత్రలో నటించింది.  ‘గ్లీ’ చిత్రంలో తనతో పాటు నటించిన మార్క్ సాలింగ్‌తో రివీరా కొద్ది రోజులు డేటింగ్ చేసింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 14, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading