జరుగుతుందా? జరగదా? : విశాల్-అనీశా రెడ్డిల వివాహంపై లేటెస్ట్ అప్‌డేట్

Vishal Anisha Marriage : విశాల్-అనీశాలకు మార్చి 18న వివాహ నిశ్చితార్థం జరగ్గా.. అక్టోబర్ 9న వివాహం జరుగుతుందన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పెళ్లిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. పెళ్లి రద్దయిందన్న ఊహాగానాలు వినిపించాయి.

news18-telugu
Updated: October 12, 2019, 10:13 AM IST
జరుగుతుందా? జరగదా? : విశాల్-అనీశా రెడ్డిల వివాహంపై లేటెస్ట్ అప్‌డేట్
కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)
news18-telugu
Updated: October 12, 2019, 10:13 AM IST
విశాల్-అనీశా రెడ్డిల పెళ్లి రద్దయినట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.తాజాగా విశాల్ పెళ్లిపై స్పందించిన ఆయన తండ్రి, సినీ నిర్మాత జీకే రెడ్డి ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.ముందుగా నిర్ణయించిన విధంగానే విశాల్-అనీశాల పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదన్నారు. నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసి.. అదే భవన్‌లో విశాల్ పెళ్లి చేసుకుంటారని చెప్పారు.గురువారం చెన్నైలో దమయంతి చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో జీకే రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.

కాగా, విశాల్-అనీశాలకు మార్చి 18న వివాహ నిశ్చితార్థం జరగ్గా.. అక్టోబర్ 9న వివాహం జరుగుతుందన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పెళ్లిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. పెళ్లి రద్దయిందన్న ఊహాగానాలు వినిపించాయి. విశాల్-అనీశాల మధ్య నెలకొన్న
మనస్పర్థలే పెళ్లి రద్దుకు కారణమన్న ప్రచారం జరిగింది. దానికి తోడు విశాల్ ఫోటోలను అనీశా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో

ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. విశాల్ రెడ్డి తండ్రి జీకే రెడ్డి తాజా వ్యాఖ్యలతో వీటన్నింటికి తెరపడింది.First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...