సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపాలని మెయిల్..

సల్మాన్ కుటుంబ సభ్యులందరినీ బయటకు పంపించి దాదాపు 4 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లో లేరు.

news18-telugu
Updated: December 14, 2019, 2:59 PM IST
సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపాలని మెయిల్..
సల్మాన్ ఖాన్ (file photo)
  • Share this:
బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్ నివాసం ఉంటున్న ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో బాంబు పెట్టినట్టుగా ఓ బాలుడు బాంద్రా పోలీసులకు నకిలీ ఈమెయిల్ పంపించాడు. మీకు ఈమెయిల్ అందిన రెండు గంటల్లో సల్మాన్ ఇంట్లో బాంబు పేలబోతుందని,దమ్ముంటే ఆపాలని అందులో పేర్కొన్నాడు.ఈమెయిల్ అందగానే స్థానిక ఏసీపీ సహా పలువురు పోలీస్ అధికారులు,బాంబ్ డిటెక్షన్&డిస్పోజబుల్ స్క్వాడ్ సల్మాన్ ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. సల్మాన్ కుటుంబ సభ్యులందరినీ బయటకు పంపించి దాదాపు 4 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లో లేరు. తనిఖీల్లో ఎక్కడా ఏమీ దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో ఏమీ లేదని నిర్దారించుకున్న తర్వాతే కుటుంబ సభ్యులను ఇంట్లోకి అనుమతించారు.

కాగా, ఆ ఈమెయిల్ నకిలీదని గుర్తించిన పోలీసులు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన బాలుడు మెయిల్ పంపించినట్టుగా గుర్తించారు. బాలుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. టిస్ హజారీ కోర్టులో అతను దాక్కున్నాడు. దీంతో బాలుడి సోదరుడైన న్యాయవాది ద్వారా అతన్ని ఇంటికి రప్పించారు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఘజియాబాద్‌లోని కబీర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు కూడా నిందితుడు మెయిల్ పంపించినట్టు గుర్తించారు. బాలుడిపై చార్జీషీట్ దాఖలు చేశామని, అయితే కోర్టు ఆదేశాల మేరకు విడిచిపెట్టామని చెప్పారు.


First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు