GHATTAMANENI RAMESH BABU LAST RITES COMPLETED AT MAHA PRASTHANAM PK
Ramesh Babu last rites: మహాప్రస్థానంలో ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి..
రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి (Ramesh Babu)
Ramesh Babu last rites: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు (Mahesh Babu) సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (Ramesh Babu) మరణించిన విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దు:ఖ సాగరంలో మునిగిపోయారు.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు మరణించిన విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. కొడుకు పార్థిక దేహాన్ని చూసి కృష్ణ, ఇందిరా దేవి దంపతులు కుప్పకూలిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న రమేష్ బాబు.. జనవరి 8 రాత్రి AIG హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఈయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చే ముందే మరణించినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ బాబు అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. పద్మాలయ స్టూడియోస్‌లో రమేష్ బాబు భౌతిక కాయానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు లేకుండానే అంత్యక్రియలు ముగిసాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.