చిరంజీవితో బన్నీని సరిపోల్చడంపై అల్లు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో బన్నీని తాను సరిపోల్చను అన్నారు బాబీ. అలా సరిపోల్చకూడదన్నారు.చిరంజీవి తన జీవితాన్ని జీరో నుంచి ప్రారంభించారన్నారు. చిరంజీవికి ఏ సపోర్ట్ లేదన్నారు. అక్కడనుంచి ఆయన మెగాస్టార్ స్థాయికి ఎదిగారన్నారు. కానీ బన్నీ విషయంలో అలా లేదన్నారు. బన్నీ పుట్టినప్పుటి నుంచే.. అల్లు రామలింగయ్య మనవడు,నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అన్నారు. పుట్టినప్పటి నుంచే అల్లు అర్జున్‌కు ఎక్స్ పోజర్ ఉందన్నారు. అయితే ఆ తర్వాత బన్నీ కూడా కష్టపడ్డాడు సక్సెస్ అయ్యాడన్నారు.
చిరంజీవి తనకు, బన్నీకి కూడా చాలా విషయాల్లో హెల్ప్ చేశారన్నారు. చిరంజీవి మాకు ఇనిస్పిరేషన్. ఆయన నుంచి మేం చాలా నేర్చుకున్నామన్నారు. అంతే తప్పా ఆయనతో మమ్మల్ని పోల్చుకోకూడదన్నారు. అల్లు అరవింద్‌తో కూడా తాను పోల్చుకోకూడదన్నారు. ఎవరు కూడా ఎవరితో కూడా సరిపోల్చుకోకూడదన్నారు. పెద్ద ఫ్యామిలీలో పుట్టినందున చిన్నప్పటి నుంచి చాలా మంది దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. తన తల్లి దగ్గర నుంచి అమ్మమ్మ, నానమ్మ, అత్తయ్యలు అందరి దగ్గర కూడా అనేక విషయాలు తెలుసుకున్నానన్నారు.
అల్లు బాబీ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నాడు. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.