Ghani Movie Review : వరుణ్ తేజ్ ‘గని మూవీ రివ్యూ.. బాక్సాఫీస్ బాక్సింగ్‌లో మెగా ప్రిన్స్ గెలిచాడా.. ?
గని మూవీ రివ్యూ (Twitter/Photo)
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు. మరి ఈ బాక్సాఫీస్ బాక్సింగ్‌లో వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా .. ? లేదా మన రివ్యూలో చూద్దాం..
రివ్యూ : గని నటీనటులు : వరుణ్ తేజ్, ఉపేంద్ర, సునీల్ శెట్టి,జగపతి బాబు, నవీన్ చంద్ర, సాయి మంజ్రేకర్ సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : జార్జ్ సి విలియమ్స్ ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్ నిర్మాతలు : సిద్దు ముద్ద, అల్లు బాబీ (వెంకటేష్) కథ, దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej) ప్రస్తుతం ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు. మరి ఈ బాక్సాఫీస్ బాక్సింగ్‌లో వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా .. ? లేదా మన రివ్యూలో చూద్దాం..
కథ :
గని (వరుణ్ తేజ్) తల్లి మాధురి (నదియా) తన కుమారుడు అతని తండ్రి వలే బాక్సింగ్ అంటూ కెరీర్ పాడు చేసుకుంటున్నాడనే ఉద్దేశ్యంతో అతను బాక్సింగ్ జోలికి వెళ్లవద్దని ఒట్టు వేయించుకుంటోంది. అయితే.. బాక్సర్ అయిన తండ్రికి కలిగిన అవమానాలు నుంచి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఎలాగైనా బాక్సర్ కావాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను హీరోయిన్ మాయ ప్రేమలో పడతాడు. మరి ప్రేమలో పడిన ఇతను తను అనుకున్న బాక్సింగ్‌లో ఛాంపియన్ కావాలనుకునే తన లక్ష్యాన్ని చేరుకున్నాడా.. ? తల్లి అతన్ని బాక్సింగ్ ఎందుకు వద్దంది.. ? గని తండ్రికి జరిగిన అవమానం ఏమిటి ? చివరకు తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం
ఇలాంటి క్రీడా నేపథ్యమున్న సినిమాలు చూడటానికి అన్ని ఒకే పార్శ్వంలో కనిపిస్తాయి. కథతో పాటు తెరకెక్కించే విధానమే వేరుగా ఉంటాయి. ముఖ్యంగా హీరో ఫ్యామిలీకి ఫ్లాష్‌బ్యాక్‌లో ఏదో అన్యాయం జరగడం వంటివి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇందులో కూడా అదే చూపించారు. చివర్లో హీరో గెలివడం అనేది కామన్ పాయింట్. స్పోర్ట్స్ డ్రామా అంటే గత కొన్నేళ్లుగా ఇదే తతంగం నడుస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ ‘గని’ ఇందుకు మినహాయింపు కాదు. తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని బాక్సింగ్ తో సమాధానం చెప్పే కథానాయికుడి కథ ఇది. ఈ కథ చూస్తుంటే.. గతంలో మనం చూసిన కొన్ని పాత సినిమాలు జ్ఞాపికకు రావడం సహజం. పవన్ కళ్యాణ్ తమ్ముడు, రవితేజ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి చాలా సినిమాలు మనకు స్పురణకు వస్తాయి. వాటికి తాలుకు ఛాయలు ప్రేక్షకులను అడుగడున కనిపిస్తూ ఉంటాయి. అయినా గనిగా వరుణ్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ వరకు ఏదో నడిపించి సెకాండాఫ్ అసలు కథలోకి వస్తాడు. మొత్తంగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా గని కోసం వరుణ్ తేజ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. హీరోయిన్ పాత్రకు ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. మిగిలిన పాత్రల్లో నటించిన ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర, నదియా తమ పరిధి మేరకు బాగా నటించారు. తమన్ రికార్డింగ్ ఈ సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. మొత్తంగా తెలిసిన కథతో రొటిన్ సినిమాను చూసినట్టు ఉంటుంది. మొత్తంగా స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలు ఇష్టపడే వాళ్లకు ‘గని’ మూవీ కనెక్ట్ అవుతోంది.
ప్లస్ పాయింట్స్
గని పాత్ర కోసం వరుణ్ తేజ్ మేకోవర్
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ,
స్క్రీన్ ప్లే
ఫస్టాఫ్ సాగతీత
చివరి మాట : ఎమోషన్‌తో కూడిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా..
రేటింగ్ : 2.75/5
Published by:Kiran Kumar Thanjavur
First published:
రేటింగ్
కథ
:
3/5
స్క్రీన్ ప్లే
:
2/5
దర్శకత్వం
:
2.5/5
సంగీతం
:
3/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.