మురుగదాస్‌‌తో ఆ సినిమా..నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు: నయనతార

నయనతార (ఫైల్ ఫోటో)

నయనతారకు ఇప్పుడున్న ఈ క్రేజ్, ఆ పేరు ఆమెకు ఊరికే రాలేదు. ఆమె తన కేరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ..వాటిలో కూడా తన వంతుగా ఆ పాత్రకు ఎంత న్యాయం చేయాలో అంత చేస్తూ.. ఇప్పుడున్న స్థానానికి ఎదిగింది. అయితే ఇటీవల నయనతార..ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేరీర్ ఆరంభంలో చేసిన సినిమాల గురించి  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Share this:
    నయనతార..లేడి సూపర్ స్టార్‌గా పిలువబడుతోన్న..ఈ భామ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నటిస్తోంది. అటూ తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అనే సినిమాలో చేస్తోంది. ఇవి కాకుండా 'మిస్టర్ లోకల్', 'తలపతి 63' మొదలగు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడున్న ఈ క్రేజ్, ఆ పేరు ఆమెకు ఊరికే రాలేదు. నయనతార తన కేరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ..వాటిలో కూడా తన వంతుగా ఆ పాత్రకు ఎంత న్యాయం చేయాలో అంత చేస్తూ.. ఇప్పుడున్న స్థానానికి ఎదిగింది. అయితే ఇటీవల నయనతార..ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కేరీర్ ఆరంభంలో చేసిన సినిమాల గురించి  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నయన తార గజినీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు అన్నీ ముఖ్య భాషల్లో నిర్మితమై..అన్ని చోట్ల పెద్ద హిట్‌గా నిలిచింది.  ఈ సినిమాలో నయన తార సెకండ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అయితే మొదట దర్శకుడు నయన్‌కు ఈ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి, దాని ప్రవర్తన, పాత్ర నిడివి ఒకలా చెప్పి.. చివరకు సినిమా విడుదల తర్వాత..తన పాత్రను మరోలా చూపించారని పేర్కోంది.

    నయనతార


    నయన తార మాట్లాడుతూ.. తన కెరీర్‌లో 'గజినీ' సినిమా చేయడమే ఓ చెత్త నిర్ణయం అని పేర్కోంది. తన పాత్ర పరిధిని చాలా కుదించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ సినిమా మంచి అనుభవం లాంటిదని..ఆ తర్వాత నుండి తాను చేయబోయే పాత్రలు, వాటి ఎంపికలో చాలా జాగ్రత్త పడ్డానని చెప్పింది.  నయనతార రజనీకాంత్ హీరోగా వచ్చిన 'చంద్రముఖి' సినిమా గురించి కూడా మాట్లాడింది. ఆ సినిమా గురించి మాట్లాడుతూ..'చంద్రముఖి' సినిమాలో తాను చిన్న పాత్రే చేసినప్పటికీ, తనను చాలా మంచిగా చూపించారని.. ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది నయనతార. అయితే ఇలా నయనతార..గజనీ సినిమా వచ్చిన ఇన్నేళ్ల తర్వాత..ఆ సినిమా గురించి మాట్లాడడం..తనకు జరిగిన అన్యాయాన్ని తెలపడంతో ఆమె అభిమానుల్లో అందోళన మొదలైంది. ఇదీ ఎక్కడికి దారీ తీస్తుందో అని..అంతేకాకుండా..దీనిపై మురుగుదాస్ స్పందన ఎలావుంటుందో అని అందోళనలో ఉన్నారు అభిమానులు.
    First published: