తెలుగు కామేడి షోలు కాస్త కల తప్పినట్టుగా కనిపిస్తుంటుంది. స్మాష్ స్కిట్స్‌తో ప్రేక్షాకులను అలరించడంలో ముందుండే జజర్థస్త్ చప్పబడింది. మెుదటి నుంచి షోను రక్తికట్టించిన పార్టిసిపెంట్స్ లేకపోవడం.. చేసే స్కిట్స్ పస ఉండకపోవంతో ఫ్యాన్స్ బోరుగా ఫీలవుతున్నారు. ఎప్పుడైతే నాగాబాబు ఆ షోను నుంచి తప్పుకున్నాడో అప్పటి నుంచి కామెడియన్స్ను ఎంకరేజ్ చేసేవారు కరువయ్యారు. రోజా హోస్ట్‌గా వచ్చి తన పని ఏదో తను చూసుకుని వెళ్లిపోతుంది. మను షోకు కొత్త కాబట్టి ఎక్కువగా ఇన్వాల్ అవ్వడం లేదు.
ఇక షోకు కాస్త గ్లామర్‌ను తీసుకొచ్చే సుడిగాలి సుధీర్ టీం కూడా అంతా యాక్టీవ్‌గా లేనట్టు కనపిస్తోంది. కాస్త టైం పాస్ కోసం యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది ఆశ్రయించిందే జజర్థస్త్ షో స్కిట్స్నే.. కానీ ఈ మద్య ఆ షోలో మసాలా కరువు అవ్వడంతో ఆ షోను చాలా మంది స్కిడ్ చేస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి గమనించిన గెటప్ శ్రీను మళ్ళీ షోకు పూర్యవైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తను నాగబాబుతో సన్నిహిత్యంతో మరోసారి అతన్ని షోలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమయే కామెడి షో అదిరింది కూడా అగిపోవడంతో ఇప్పుడు నాగబాబు ఖాళీగానే ఉన్నారు. దీంతో అతన్ని మళ్ళీ జజర్థస్త్ షోకు తీసుకొచ్చే పనిలో పడ్డారు. సుధీర్&కో టీం. అలాగే మల్లెమాల కూడా నాగబాబు వస్తనంటే సాదరంగా ఆహ్వానిచ్చేందుకు సిద్దంగా ఉంది.
Published by:Rekulapally Saichand
First published:January 24, 2021, 10:23 IST