యాంకర్ ప్రదీప్,రష్మీ,అనసూయలో... ఆ తీరు నచ్చదంటున్న గెటప్ శ్రీను

గెటప్ శ్రీను

తాను ఇండస్ట్రీకి రావడానికి కారణం మ్యాగీయే అంటూ చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను.

  • Share this:
    జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తెలుగు యాంకర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్య్యూలో ప్రముఖ యాంకర్లలో మీకు నచ్చనవి ఏంటని అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. జబర్దస్త్‌ షోకు వస్తున్న అనసూయ... ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు రాకపోవడం తనకు నచ్చదంటున్నారు. ఆమె ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రొగ్రామ్‌కు వస్తే మరింత బావుంటుందన్నాడు. ఇక మరో యాంకర్ రష్మీ విషయంలో తనకు ఓ పద్ధతి నచ్చదన్నారు. మాస్కిట్‌ రష్మీ చేస్తే బావుంటుందని అనుకుంటాను. కానీ రష్మీ మా స్కిట్‌లో నటించదన్నాడు. అందుకే రష్మీలో తనకు ఆ పద్ధతి నచ్చదన్నాడు. ఇక ప్రదీప్ మా జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రష్మీతో పాటు కలిసి కో యాంకరింగ్ చేస్తే బావుంటదని అనుకుంటాను. కానీ ఆయన అలా యాంకరింగ్ చేయడని చెప్పుకొచ్చాడు. ఇక తాను ఇండస్ట్రీకి రావడానికి కారణం మ్యాగీయే అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత అనేకమంది తనకు ఎంతగానే సాయపడ్డారన్నారు గెటప్ శ్రీను.

    Published by:Sulthana Begum Shaik
    First published: