హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: గెటప్ శ్రీనుకు షాక్ ఇచ్చిన ఆచార్య సినిమా

Acharya: గెటప్ శ్రీనుకు షాక్ ఇచ్చిన ఆచార్య సినిమా

గెటప్ శ్రీనుకు షాక్ ఇచ్చిన ఆచార్య టీం

గెటప్ శ్రీనుకు షాక్ ఇచ్చిన ఆచార్య టీం

మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేసిన గెటప్ శ్రీనుకు.. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

  మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే పలు సీన్లు తొలగించారని భారీగా టాక్ వస్తోంది. ఆచార్యలో కాజల్ హీరోయిన్ అని ప్రకటించారు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను.. టీజర్‌లో కూడా కాజల్‌ను చూపించారు.అయితే ఆ తర్వాత మాత్రం కాజల్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఆచార్య టీం. కాజల్ పాత్రను పూర్తిగా తొలగించినట్లు కొరటాల సినిమా విడుదలకు ముందు ప్రకటించారు. ఇప్పుడు ఆచార్య సినిమా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఇప్పుడు మరో నటుడు సీన్లు కూడా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి

  మామూలుగానే సినిమాలో నటించే ఎవరి సీన్లు ఎడిటింగ్ కు గురైపోతే బాధగా వుంటుంది. మంచి సీన్లు లేపేసారు అని లోలోపల వారంతా బాధపడుతుంటారు. అయితే ఓ పెద్ద సినిమాలో అవకాశం వచ్చినప్పుడు... వారి నటనకు తమ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించినప్పుడు కూడా ఇలాంటివి జరిగితే ఆ బాధ రెట్టింపు అవుతోంది. ఇప్పుడు ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను విషయంలో ఇదే జరిగింది. జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు గెటప్ శ్రీను కు ఇలాంటి అనుభవమే ఎదురయిందని వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆచార్య సినిమా కోసం గెటప్ శ్రీను కాస్త ఎక్కువ రోజులే పని చేసాడని తెలుస్తోంది. మాంచి కామెడీ ట్రాక్ రన్ చేసారు. కానీ మరి ఏమయిందో ఫైనల్ ఎడిట్ లో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ లేచిపోయిందని సమాచారం.

  బహుశా కాజ‌ల్ కాంబినేషన్ కామెడీ సీన్లు ఉండొచ్చేమోనని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. లేదా సీరియస్ సినిమాలో ఫన్ ప్రొపర్ గా మిక్స్ కాకపోవడం లేదన్న డౌట్‌తో అయిన ఆ ఎంటర్ టైన్ మెంట్‌ను లేపేసి ఉంటారని అనుకుంటున్నారు. మొత్తానికి సీన్లు లేపేసారని టాక్ వినిపిస్తోంది. పాపం గెటప్ శ్రీనుకు మెగాస్టార్ అంటే ఎంతో అభిమానం. అలాంటిది చిరు సినిమాలో అవకాశం రాగానే.. శ్రీను ఎగిరి గంతేసి ఉంటాడు. అలాంటిది ఇప్పుడు... మెగాస్టార్ సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్స్ తీసేసారని తెలిస్తే ఆ బాధ వర్ణించలేం.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Acharya, Getup srinu, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు