మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వస్తున్న మెగా మూవీ 'ఆచార్య' సినిమా (Acharya). చరణ్ - నిరంజన్ రెడ్డి కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అవినీతిపరుల భరతం పట్టాలంటే ఆయుధం పట్టాల్సిందే అనే ఉద్దేశంతో ఇద్దరు కథానాయకులు అడుగుముందుకు వేసే కథ ఇది. ఈ సినిమాలో చిరూ సరసన కాజల్ మెరవనుంది. ఇక 'సిద్ధ' అనే ఒక ముఖ్యమైన పాత్రను రామ్ చరణ్ (Ram Charan Tej) చేయగా, ఆయన జోడీగా పూజ హెగ్డే (Pooja Hegde) అందాల సందడి చేయనుంది. ఇప్పటికే 'నీలాంబరి' పాత్రతో లుక్ పరంగా ఆమె ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగించాయి. మణిశర్మ కంపోజ్ చేసిన.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ పాటలు అలరించాయి. ఇంట్రెడక్షన్ సీన్స్.. స్పెషల్ టీజర్స్ తో.. ఆచార్య ప్రమోషన్స్ విషయంలో అందరికంటే ముందే ఉంది. అయితే ఇప్పుడు మరో భారీ అప్ డేట్ కు మెగా టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆచార్య నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాలని చిరంజీవి భావించారట. అందుకే ఏ అప్ డేట్ ఇస్తే బాగుంటుంది అని టీమ్ అంతా ఆలోచించి.. కొన్ని ఐడియాస్ ను పంచుకుని.. చివరికి ఒక నిర్ణాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆచార్య నుంచి చిరంజీవి, రామ్ చరణ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ తో.. టీజర్ కాని.. ట్రైలర్ కాని రిలీజ్ చేయలని చూస్తున్నారట. ఇది వర్కైట్ కాకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో.. పవర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్.
మెగా మూవీ నుంచి చిన్న పోస్టర్ వచ్చినా.. అది వైరల్ అవుతుంది. అటువంటిది మెగా తండ్రీ కొడుకులు కాంబినేషన్ లో ఏ అప్ డేట్ వచ్చినా అది రచ్చ చేయడం కాయం. ఇప్పటికే మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆచార్య నుంచి మెగాస్టార్ లుక్.. రామ్ చరణ్ లుక్ సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే ఇచ్చారు.
ఇది కూడా చదవండి : మేమింతే.. మా ఇష్టం అంటే కుదరదని నానికి బొత్స కౌంటర్.. థ్యాంక్స్ చెప్పిన అనిత
సినిమా రిలీజ్ కు ఇంకా నెలరోజులకు పైగా టైమ్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లాన్ చేసుకుని ఉన్నారు ఆచార్య టీమ్. న్యూ ఇయర్ కు రిలీజ్ చేయబోయే స్పెషల్ అప్ డేట్ తోనే.. అఫీషియల్ గా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అందరికంటే డిఫరెంట్ గా.. సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తున్నారు టీమ్. సినిమా విషయంలో కూడా ఏం తేడా రాకుండా కొన్ని ప్యాచ్ వర్క్స్ కూడా ఈమధ్య చేసేసినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : తగ్గేదే లే.. బుల్లి తెరపై కూడా దుమ్మురేపిన లవ్ స్టోరీ.. ఎంత రేటింగ్ అంటే..
ఇటు చిరంజీవి నుంచి వదిలిన 'లాహే లాహే' సాంగ్, అటు చరణ్ - పూజ హెగ్డే కాంబినేషన్లో వదిలిన 'నీలాంబరి' సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. మణిశర్మ ట్యూన్స్ కి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. లేటెస్ట్ గా వచ్చిన సిద్ధ టీజర్ కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. దీంతో, చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో సాలిడ్ అప్ డేట్ ఇవ్వాలని సినిమా యూనిట్ భావిస్తోందట. చిరంజీవి - చరణ్ లకి సంబంధించిన కీలకమైన అంశాలతో కూడిన ఒక ట్రైలర్ ను గానీ .. ఇద్దరిపై చిత్రీకరించిన పాటను గాని వదిలే అవకాశం ఉందని అంటున్నారు. మేకర్స్ ఎలా ప్లాన్ చేశారో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya movie, Kajal Aggarwal, Koratala siva, Megastar Chiranjeevi, New Year 2022, Ramcharan