Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    జార్జి రెడ్డి, నేను క్లోజ్ అంటున్న సీనియర్ టాలీవుడ్ దర్శకుడు..

    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు జార్జి రెడ్డి. ఈయన జీవిత కథపై ఇప్పుడు జార్జి రెడ్డి సినిమా వస్తుంది. మరికొన్ని గంటల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంది.

    Praveen Kumar Vadla | news18-telugu
    Updated: November 20, 2019, 5:30 PM IST
    జార్జి రెడ్డి, నేను క్లోజ్ అంటున్న సీనియర్ టాలీవుడ్ దర్శకుడు..
    ‘జార్జ్ రెడ్డి’ పాత్రలో సాండీ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్)
    • Share this:
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు జార్జి రెడ్డి. ఈయన జీవిత కథపై ఇప్పుడు జార్జి రెడ్డి సినిమా వస్తుంది. మరికొన్ని గంటల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంది. కొందరు ఈయన్ని హీరో అంటుంటే.. మరికొందరు మాత్రం రౌడీ షీటర్ అంటున్నారు. ఓ విలన్‌ను కావాలనే హీరోగా చిత్రీకరిస్తున్నారంటూ కొన్ని వర్గాలు మండిపడుతున్నాయి. మరికొన్ని సంఘాలు మాత్రం జార్జి రెడ్డి అమరుడు.. హీరో.. ఉస్మానియాలో బడుగు వర్గ విధ్యార్థుల కోసం ఉద్యమం చేసిన మహా వీరుడు అంటూ కొనియాడుతున్నారు. వీళ్ల కోణాలు ఎలా ఉన్నా కూడా టాలీవుడ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం జార్జి రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
    George Reddy was very close friend of mine says Tollywood director Tammareddy Bharadwaj pk తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు జార్జి రెడ్డి. ఈయన జీవిత కథపై ఇప్పుడు జార్జి రెడ్డి సినిమా వస్తుంది. మరికొన్ని గంటల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంది. tammareddy bharadwaja george reddy,george reddy movie review,george reddy movie updates,george reddy public talk,george reddy movie,george reddy,george reddy trailer,george reddy movie trailer,george reddy speech,george reddy life story,george reddy story,george reddy biography,george reddy osmania university,george reddy songs,george reddy movie songs,george reddy telugu movie,george reddy movie first look,george reddy teaser,george reddy biopic,george reddy documentary,george reddy real story,telangana george reddy,telugu cinema,జార్జి రెడ్డి,జార్జి రెడ్డి మూవీ రివ్యూ,జార్జి రెడ్డి సినిమా రివ్యూ,జార్జి రెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్,జార్జి రెడ్డి సినిమా,జార్జి రెడ్డి అప్ డేట్స్
    తమ్మారెడ్డి భరద్వాజ్ జార్జి రెడ్డి


    తనకు తెలిసి ఆయన జీవితంలో చూసిన రియల్ హీరో జార్జి రెడ్డి అంటున్నాడు ఈ దర్శకుడు. తను నమ్మిన సిద్దాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడాడని.. వాళ్ల కోసం నిలబడ్డాడని చెప్పాడు తమ్మారెడ్డి. ఆయన నమ్మిన సిద్దాంతాలు నచ్చని వాళ్లే జార్జి రెడ్డిని ఈ రోజు విలన్.. గూండా అంటూ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నాడు ఈయన. ఆ పరిస్థితుల్లో జార్జిరెడ్డికి కూడా అవతల వాళ్లు విలన్లుగా కనిపించి ఉండొచ్చు కదా అంటున్నాడు తమ్మారెడ్డి భరద్వాజ్. ఒక్కడే వెళ్లి.. పది ఇరవై మందిని ఎదిరించేవాడు.. గొప్ప బాక్సర్ అని తెలిపాడు ఈయన. అప్పట్లో కాలేజ్ నుంచి జార్జి రెడ్డిని రెస్టిగేట్ చేసిన తర్వాత తమ ఇంట్లోనే ఉండేవాడని చెప్పాడు తమ్మారెడ్డి. అప్పట్లో కమ్యూనిస్ట్ భావాజాలానికి సంబంధించిన పుస్తకాలన్నీ జార్జి చదివేశాడని తెలిపాడు ఈయన.
    George Reddy was very close friend of mine says Tollywood director Tammareddy Bharadwaj pk తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు జార్జి రెడ్డి. ఈయన జీవిత కథపై ఇప్పుడు జార్జి రెడ్డి సినిమా వస్తుంది. మరికొన్ని గంటల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంది. tammareddy bharadwaja george reddy,george reddy movie review,george reddy movie updates,george reddy public talk,george reddy movie,george reddy,george reddy trailer,george reddy movie trailer,george reddy speech,george reddy life story,george reddy story,george reddy biography,george reddy osmania university,george reddy songs,george reddy movie songs,george reddy telugu movie,george reddy movie first look,george reddy teaser,george reddy biopic,george reddy documentary,george reddy real story,telangana george reddy,telugu cinema,జార్జి రెడ్డి,జార్జి రెడ్డి మూవీ రివ్యూ,జార్జి రెడ్డి సినిమా రివ్యూ,జార్జి రెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్,జార్జి రెడ్డి సినిమా,జార్జి రెడ్డి అప్ డేట్స్
    తమ్మారెడ్డి భరద్వాజ్ జార్జి రెడ్డి

    లెనిన్, మార్క్స్, దాస్ కాపిటల్ లాంటి పుస్తకాలన్నీ తిరగేశాడని తమ్మారెడ్డి చెప్పాడు. జార్జి రెడ్డి అందర్నీ మర్యాదగా పలకరించేవాడని.. ఎంతో గౌరవించేవాడని చెప్పాడు ఈయన. చివరికి ఆయన చనిపోయిన రోజు కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు తాను జార్జి రెడ్డిని లైబ్రరీ వద్ద వదిలి వెళ్లానని.. ఆ తరువాత గంటకే హత్య చేశారని చెప్పుకొచ్చాడు తమ్మారెడ్డి. హాస్టల్‌కు ఒంటరిగా వెళ్లొద్దని తనకు చెప్పిన జార్జి రెడ్డి.. ఆయన ఎందుకు ఒంటరిగా వెళ్తాడని.. ఎవరో బలవంతంగా తీసుకెళ్లి ఉంటారని చెప్పుకొచ్చాడు ఈయన. భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన వాడు.. ఇలాంటి వాటిలోకి వస్తారని ఎవ్వరూ ఊహించరని.. ఒకవేళ అతను బతికి ఉన్నా తనకున్న భావాజాలానికి అడవులకు వెళ్లేవాడేమోనని చెప్పాడు ఈ దర్శకుడు. మొత్తానికి జార్జి రెడ్డితో తనకున్న అనుబంధం అద్భుతమైందని గుర్తు చేసుకున్నాడు తమ్మారెడ్డి భరద్వాజ్.
    Published by: Praveen Kumar Vadla
    First published: November 20, 2019, 5:29 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading