ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కింది జార్జ్ రెడ్డి సినిమా. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో 1960, 70ల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో చర్చించారు. 'దళం' సినిమాను తీసిన జీవన్ రెడ్డి ఈ సినిమాను దర్శకత్వం వహించగా.. మైక్ మూవీస్ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మించారు. టైటిల్ రోల్లో వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ నటించాడు. అది అలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఫోర్త్ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. అందులో భాగంగా డిసెంబర్ 22, 23 తేదీల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. తెలుగు సినిమా ‘జార్జ్ రెడ్డి’ ఇప్పుడు అంతర్జాతీయస్థాయికి వెళ్లడంపై చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సందీప్ మాధవ్‌తో పాటు సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి మిగిత పాత్రల్లో నటించారు. మరాఠి సినిమా ‘సైరాత్’ కు సినిమాటోగ్రఫి అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు పనిచేశాడు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.