జార్జిరెడ్డి సినిమాపై వస్తున్న వివాదాలు.. రైటిస్టులు చేస్తున్న విమర్శలపై చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి స్పందించారు.తాను లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ కాదని.. స్ట్రైట్ వింగ్ అని స్పష్టం చేశారు. జార్జిరెడ్డి సినిమాను పూర్తి ఆధారాలతో వాస్తవాలతో తెరకెక్కించినట్టు చెప్పారు. ఒక స్టూడెంట్ లీడర్ సినిమాను తాము నిజాయితీగా తెరకెక్కించామన్నారు. తాను సినిమా మొదలుపెట్టేముందే నిర్మాతతో చెప్పానని.. జార్జిరెడ్డి భావజాలన్ని మాత్రమే తెరకెక్కించానని చెప్పారు. సినిమా విడుదలయ్యాక దేశంలో ఉన్న ప్రతీ విద్యార్థి నాయకుడు
జార్జిరెడ్డి భావజాలన్ని అనుసరించేందుకు ఇష్టపడుతారని చెప్పారు. సినిమా చూడకముందే లేనిపోనివి ప్రచారం చేయడం సబబు కాదన్నారు.
ఇక సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయనంటే తనకు చాలా గౌరవం అని చెప్పారు. రాజాసింగ్‌తో కలిసి సినిమా చూసేందుకు సిద్దమన్నారు. తార్నాక ఆరాధన థియేటర్‌లో 22న సినిమా చూస్తానని.. సినిమా తర్వాత బయటే తిరుగుతానని చెప్పారు.సినిమా చూశాక ప్రతీ ఒక్కరు అభినందించడం మీరే చూస్తారని అభిప్రాయపడ్డారు. సినిమాలో ఎవరిని కించపరచలేదని.. అలా ఎవరైనా అనుకుంటే తానేమీ చేయలేదని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.