Home /News /movies /

Akash Puri : జార్జ్ రెడ్డి డైరెక్టర్‌తో జత కట్టిన ఆకాష్ పూరి.. ఫిబ్రవరి 26 నుంచి షూటింగ్..

Akash Puri : జార్జ్ రెడ్డి డైరెక్టర్‌తో జత కట్టిన ఆకాష్ పూరి.. ఫిబ్రవరి 26 నుంచి షూటింగ్..

Jeevan Reddy and Akash Puri Photo : Twitter

Jeevan Reddy and Akash Puri Photo : Twitter

Akash Puri : పూరి జగన్నాధ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా కొత్త సినిమా ఈరోజు ప్రారంభమైంది.

    పూరి జగన్నాధ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా కొత్త సినిమా ఈరోజు ప్రారంభమైంది. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఆకాష్ పూరి హీరోగా మంచి హిట్ కొట్టేందుకు ఎప్పటినుండో కృషి చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆకాష్ నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేదు. ఇక చోర్ బజార్ అనే పేరుతో వస్తోన్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నాడు. చోర్ బజార్ ముఖ్యంగా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ఈ నెల అంటే ఫిబ్రవరి 26 నుండి షూటింగ్ మొదలు పెట్టనుంది. చోర్ బజార్‌కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నాడు. ఇక ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన తన తండ్రి నిర్మాణంలో  'రోమాంటిక్' పేరుతో వస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. విడుదల కూడా కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో రొమాంటిక్ విడుదలకానుంది. ఈ విషయంపై చిత్రబృందం ప్రకటన చేయాల్సి ఉంది.

    ఈ సినిమాను యువ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా చాలా వరకు గోవాలో చిత్రీకరణ జరుపుకుంది. కొంతమేరకు హైదరాబాద్‌లో జరుపుకుంది. రొమాంటిక్‌లో రమ్యకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.










    View this post on Instagram






    A post shared by Akash Puri (@actorakashpuri)





    ఇక ఆకాష్ పూరిగా జంటగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో మందిరా బేడి కనిపించనుంది. మందీరా సాహోలో కల్కిగా మెరిసిన సంగతి తెలిసిందే. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు