GENTLEMAN 2 ACTION KING ARJUN SHANKAR GENTLEMAN MOVIE SEQUEL READY TO GO ON FLOORS RRR FAME KEERAVANI TO COMPOSE MUSIC TO THIS SEQUEL SAYS PRODUCER KT KUNJUMON TA
Gentleman 2 : ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ’జెంటిల్‌మేన్ 2’ కు మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి.. అఫీషియల్ ప్రకటన..
‘జెంటిల్‌మేన్ 2’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి (Twitter/Photo)
Gentleman 2 Action Kign Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తొలి సినిమాగా తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. దర్శకుడిగా తొలి సినిమాతోనే తన గట్స్ ఏంటో చూపించాడు శంకర్. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత కే.టీ.కుంజుమోన్ ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్టు ప్రకటించారు.
Gentleman 2 : యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తొలి సినిమాగా తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూసి తన గట్స్ ఏంటో చూపించాడు శంకర్. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు సందేశం ఇచ్చి దక్షిణాది ప్రేక్షకులను తనవైపు తిప్పుకుని పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు శంకర్. ఈ సినిమాతో హీరోగా అర్జున్‌తో పాటు దర్శకుడిగా శంకర్ పేరు మారు మోగిపోయింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘జెంటిల్‌మేన్’ పేరుతో ప్రముఖ నిర్మాత కే.టి.కుంజుమోన్ భారీ ఎత్తున తెరకెక్కించారు. తెలుగులో అదే ‘జెంటిల్‌మేన్’ టైటిల్‌తో ఏ.ఎం.రత్నం.. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే.. ఈ సినిమా ఇక్కడ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది.
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో హిట్టైన ‘జెంటిల్‌మేన్’ చిత్రాన్ని హిందీలో చిరంజీవి హీరోగా రీమేక్ చేసారు. కానీ ఆ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు రుచించలేదు దీంతో బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాను అప్పట్లోనే నిర్మాత కేటీ కుంజుమోన్ భరీ ఎత్తున తెరకెక్కించారు. అప్పటికే ఈయన శరత్ కుమార్‌తో ‘మండే సూర్యడు’ వంటి పలు చిత్రాలను తమిళంలో నిర్మించారు. ‘జెంటిల్‌మేన్’ సినిమాతో ఈయన పేరు మారు మ్రోగిపోయింది. ఇక ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ స్వరపరిచిన సంగీతం పెద్ద హిట్టైయింది.
ఇక జెంటిల్‌మేన్ సినిమాలో చికుబుకు చికుబుక రైలే పాటలో మెరిసిన ప్రభుదేవాతో నెక్ట్స్ ప్రాజెక్ట్ శంకర్ దర్శకత్వంలో ‘కాదలన్’ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాను తెలుగులో ‘ప్రేమికుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాాత కుంజుమోన్ నాగార్జున తో ‘రచ్చకన్’ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించాడు. ఆ సినిమా తెలుగులోె ‘రక్షకుడు’ పేరుతో విడుదలైంది.
ఈ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘జెంటిల్‌మేన్’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత కే.టీ.కుంజుమోన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా .ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తమిళం, తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు.
కానీ ఈ సీక్వెల్‌ను ఎవరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఎవరు హీరోగా నటించబోతున్నారనేది మాత్రం ప్రకటించలేదు. కానీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా లెజండరీ సంగీత దర్శకుడు కీరవాణిని తీసుకున్నారు. ఈ విషయాన్ని కుంజుమోన్ అపీషియల్‌గా ప్రకటించారు. ఇప్పటికే ‘బాహుబలి’ సిరీస్‌తో పాటు ‘ఆర్ఆర్ఆర్’తో కీరవాణి పేరు మారుమ్రోగిపోయింది. దీంతో తన నిర్మాణంలో తెరకెక్కే ‘జెంటిల్మెన్ 2’ సినిమాకు కీరవాణి అయితే.. పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని భావించి ఆయన్ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. పైగా ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ రేంజే వేరే ఉంటుంది.
ఈ సినిమాను కే.టీ.కుంజుమోన్ .. జెంటిల్‌మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ‘జెంటిల్‌మేన్ 2’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ మేకింగ్‌ను తలదన్నేలా నిర్మించబోతున్నట్టు తెలిపారు. మొత్తంగా ‘జెంటిల్‌మేన్ 2’ పై అఫీషియల్ ప్రకటన వెలుబడటంతో ఈ సినిమాపై అపుడే బజ్ మొదలైంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.