Home /News /movies /

GENELIA MAKES FUN WITH RAM POTHINENI VIDEO GOES VIRAL SEE FULL DETAILS HERE MNJ

Ram Pothineni- Genelia: రామ్‌తో ఫ‌స్ట్ ఇన్‌స్టా రీల్ వీడియో చేయించిన జెనీలియా.. చూస్తే పొట్ట‌చెక్క‌లే

రామ్ జెనీలియా

రామ్ జెనీలియా

Ram Pothineni- Genelia: రామ్ పోతినేని, జెనీలియా మంచి స్నేహితుల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రెడీ చిత్రంలో ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం నెల‌కొంది. ఇక ఈ మూవీ తరువాత వీరిద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ కొన‌సాగుతూ వ‌చ్చింది

ఇంకా చదవండి ...
    Ram Pothineni- Genelia: రామ్ పోతినేని, జెనీలియా మంచి స్నేహితుల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రెడీ చిత్రంలో ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం నెల‌కొంది. ఇక ఈ మూవీ తరువాత వీరిద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ కొన‌సాగుతూ వ‌చ్చింది. ఇద్ద‌రు క‌లిసి త‌ర‌చుగా క‌లుసుకునేవారు. ఆ త‌రువాత జెనీలియాకు బాలీవుడ్ న‌టుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో వివాహం జ‌ర‌గ్గా.. రామ్ అత‌డికి మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇక ముగ్గురు క‌లిసి అప్పుడ‌ప్పుడు పార్టీలు కూడా చేసుకుంటుంటారు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రెడీ 2 కోసం ఎదురుచూస్తున్న‌ట్లు రితేష్ దేశ్‌ముఖ్ కూడా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌డం విశేషం. ఇదిలా ఉండే రామ్, జెనీలియా ఇటీవ‌ల మ‌ళ్లీ క‌లిశారు.

    ఈ సంద‌ర్భంగా ఎప్పుడూ క్రేజీ ప‌నులు చేసే అల‌వాటున్న జెనీలియా రామ్‌తో ఇన్‌స్టా రీల్ వీడియో చేయించేందుకు ట్రై చేసింది. ఇటీవ‌ల స్కేటింగ్ నేర్చుకుంటూ జెనీలియా చెయ్యికి చిన్న గాయం త‌గ‌ల‌గా.. బ్యాండ్ వేసుకొని రెడీ పాట‌లోని అయ్యో అయ్యో అయ్యో దాన‌య్య పాట‌కు రామ్‌తో స్టెప్పులు వేయించాల‌నుకుంది. వీడియో స్టార్టింగ్ బాగానే ఉన్నా.. త‌రువాత మాత్రం ఫ‌న్నీగా మారిపోయింది. అస‌లు ఏం చేస్తున్నావు నువ్వు అంటూ రామ్‌, జెనీలియాను అడిగాడు.








    View this post on Instagram






    A post shared by Genelia Deshmukh (@geneliad)






    ఇక ఈ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు జెనీలియా. దానికి అయ్యో అయ్యో అయ్యో బాబు గారు ఫ‌స్ట్ టైమ్ రీల్ చేస్తున్నారు క‌దా అందుకే సిగ్గు ప‌డుతున్నాడు. రామ్ నువ్వు చాలా క్రేజీ ప‌ర్స‌న్‌వి అని కామెంట్ పెట్టారు. ఈ వీడియో అటు జెనీలియా అభిమానుల‌తో పాటు ఇటు రామ్ అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే జెనీలియా త్వ‌ర‌లో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె క‌థ‌ల‌ను వింటున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Manjula S
    First published:

    Tags: Genelia, Ram Pothineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు