హోమ్ /వార్తలు /సినిమా /

Genelia D'Souza: జెనీలియా నటించిన ‘బొమ్మరిల్లు’ హిందీ రీమేక్ టీవీలో విడుదల..

Genelia D'Souza: జెనీలియా నటించిన ‘బొమ్మరిల్లు’ హిందీ రీమేక్ టీవీలో విడుదల..

జెనీలియా ‘ఇట్స్ మై లైఫ్’ సినిమా టీవీలో విడుదల (Twitter/Photo)

జెనీలియా ‘ఇట్స్ మై లైఫ్’ సినిమా టీవీలో విడుదల (Twitter/Photo)

Genelia D'Souza: Its My Life Movie Air on TV | జెనీలియా డిసౌజా నటించిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హాసినిగా ఆమె పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా టీవీల్లో ప్రసారం చేయనున్నారు.

ఇంకా చదవండి ...

Genelia D'Souza: Its My Life Movie Air on TV | జెనీలియా డిసౌజా నటించిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హాసినిగా ఆమె పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2006లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఈ సినిమా తర్వాత ఎవరైనా స్ట్రిక్ట్ ఫాదర్ కనబడితే... బొమ్మరిల్లు ఫాదర్  అంటూ కామెంట్స్ కూడా వినబడ్డాయి. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ప్రకాష్ రాజ్, సిద్ధార్ధ్‌కు ఎంత పేరు వచ్చిందో .. హీరోయిన్ హాసినగా నటించిన జెనీలియాకు అంత పేరు వచ్చింది.  తెలుగులో సిద్దార్ధ్ హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ ఇంటి పేరు బొమ్మరిల్లు భాస్కర్‌గా స్థిరపడిపోయింది. తెలుగులో హిట్టైన ఈ సినిమాను తమిళంలో పాటు బెంగాలి, ఒరియాలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను బోనీ కపూర్ కొనుగోలు చేసాడు. అంతేకాదు హిందీలో నానా పాటేకర్, హర్మన్ బవేజా, జెనీలియాతో  ‘ఇట్స్ మై లైఫ్’ పేరుతో  అనీస్ బజ్మీ దర్శకత్వంలో రీమేక్ చేసారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రను నానా పాటేకర్ చేసారు. సిద్ధార్ధ్ పాత్రను హర్మన్ బవేజా చేసారు. జెనీలియా పాత్రను హిందీలో జెనీలియానే చేసింది. ఇక నానా పాటేకర్ మరాఠీలో నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ప్రకాష్ రాజ్ ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తుండటం విశేషం.


హిందీలో రీమేక్  చేసిన ఈ సినిమా పూర్తైనా.. ఇప్పటి వరకు విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను  జీ వాళ్లు కొనుగోలు చేసారు. ఈ సినిమాను ఈ నెల 29 జీ సినిమా ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ సినిమాలో కమెడియన్ కపిల్ శర్మ ముఖ్యపాత్రలో నటించాడు.  ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. మరి డైరెక్ట్‌గా టీవీలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రేటింగ్స్ సాధిస్తుందో చూడాలి. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  మరోవైపు జెనీలియా విషయానికొస్తే.. ఈమె తెలుగులో మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌లో జెనిలియా యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

First published:

Tags: Bollywood, Genelia, Nana Patekar, Tollywood