Home /News /movies /

GENELIA DESHMUKH WANTS TO COMEBACK INTO MOVIES AFTER LONG GAP WITH STRONG ROLES PK

Genelia Deshmukh: ‘అమ్మ’ అవుతానంటున్న జెనీలియా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి..?

జెనీలియా దేశ్‌ముఖ్ (genelia deshmukh/instagram)

జెనీలియా దేశ్‌ముఖ్ (genelia deshmukh/instagram)

Genelia Deshmukh: జెనీలియా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "బొమ్మ‌రిల్లు"లో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు.

జెనీలియా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "బొమ్మ‌రిల్లు"లో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఇక "సాంబ‌".. "ఆరెంజ్".. "సై".. "సుభాష్ చంద్ర‌బోస్" లాంటి చాలా సినిమాలు చేసింది ఈ భామ‌. ఒక‌ప్పుడు వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా కూడా ఒప్పుకోలేదు. కొడుకు పుట్టిన త‌ర్వాత ఇంటికే ప‌రిమితం అయిపోయింది జెనిలియా. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఈ భామ‌కు సినిమాల‌పై ధ్యాస మ‌ళ్లిన‌ట్లుంది. అందుకే త్వ‌ర‌లోనే తాను సినిమాలు చేయ‌బోతున్న‌ట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం భ‌ర్త రితేష్ న‌టిస్తున్న సినిమాల‌కు నిర్మాత‌గా ఉన్న జెనిలియా త్వ‌ర‌లోనే న‌టిగా మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌బోతుంది.
జెనీలియా దేశ్‌ముఖ్ (genelia deshmukh/instagram)
జెనీలియా దేశ్‌ముఖ్ (genelia deshmukh/instagram)

అయితే పెళ్లైన ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఈమెను హీరోయిన్‌గా ఒప్పుకుంటారా అనేది అనుమాన‌మే. అలాగ‌ని జెన్నీ అక్క‌, వ‌దిన పాత్ర‌ల్లో న‌టిస్తే అభిమానులు త‌ట్టుకోలేరు. మంచి క‌థ వ‌స్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు జెనిలియా ముందున్న ఆప్ష‌న్. మంచి కథ వస్తే నటించడానికి తనకేం అభ్యంతరం లేదని చెబుతుంది జెన్నీ బేబీ. ఇప్పటికే కొన్ని కథలు వింటుంది జెనీలియా. అందులో ఒకటి భర్తతో కలిసి నటించబోతుంది కూడా. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనుంది జెనీలియా. దాంతో పాటు మరిన్ని అవకాశాలు వస్తే బాగుంటుందని ఆశిస్తుంది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్‌లోనే రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది హాసిని.
జెనీలియా దేశ్‌ముఖ్ (genelia deshmukh/instagram)
జెనీలియా దేశ్‌ముఖ్ (genelia deshmukh/instagram)

అక్కడే స్ట్రాంగ్ కారెక్టర్స్ చేయాలనుకుంటుంది. అందుకే బాలీవుడ్ దర్శకులకు హింట్స్ కూడా ఇస్తుంది జెన్నీ బేబీ. నిడివి తక్కువగా ఉన్నా కూడా కథను మార్చే పాత్రలైతే తాను చేస్తానంటుంది. అంతేకాదు.. కథ నచ్చితే తల్లి పాత్రలు చేయడానికి కూడా తనకెలాంటి అభ్యంతరాలు లేవంటుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది జెనీలియా. అప్పుడే రితేష్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలు కూడా తిరిగింది. ఏదేమైనా కూడా గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సినిమాల వైపు వచ్చేస్తుంది హాసిని. అంటే జెనిలియా అల్ల‌రిని మ‌ళ్లీ తెర‌పై చూసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్న‌మాట‌.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Genelia, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు