ఒక్కోరోజు గడుస్తుంటే "గీతగోవిందం" రికార్డుల రచ్చ కూడా పెరిగిపోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం మీడియం బడ్జెట్ సినిమాల్లో వసూళ్ల పరంగా చరిత్ర తిరగరాస్తుంది. కేవలం 6 రోజుల్లోనే 35 కోట్ల షేర్ తీసుకొచ్చిందంటే "గీతగోవిందం"పై ప్రేక్షకుల ప్రేమ ఎంతుందో అర్థం అయిపోతుంది. ఇప్పటికీ రోజుకు కనీసం 2 నుంచి 3 కోట్ల షేర్ తీసుకొస్తుంది "గీతగోవిందం". దాంతోపాటు విజయ్ సుడి ఎలా ఉందంటే కోరిమరీ సెలవులు కూడా వస్తున్నాయి. ఈ వారం బక్రీద్ ఉండటం.. మరోవైపు ఆగస్ట్ 24న పెద్దగా పేరున్న సినిమాలేవీ లేకపోవడంతో "గీతగోవిందం" మరో 10 కోట్ల వీకెండ్‌పై కన్నేసింది. ఇదే కానీ జరిగితే విజయ్ 50 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.
ఇక కలెక్షన్ల పరంగా ఇలా ఉంటే.. మరోవైపు ఈ చిత్ర ఆడియో కూడా ఇప్పటికీ సంచలనాలు సృష్తిస్తుంది. ముఖ్యంగా ఇంకేం కావాలి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ ట్యూన్ ఆరు నుంచి అరవై వరకు కనెక్ట్ అయిపోయింది. దాంతో యూట్యూబ్‌లో రికార్డులు కూడా అలాగే తిరగరాస్తుంది ఈ ఆల్బమ్. తాజాగా "గీతగోవిందం" ఖాతాలో మరో రికార్డ్ పడిపోయింది. దక్షిణాదిన ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఇంకేం కావాలి పాటకు యూ ట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్‌తో పాటు 5 లక్షల 25 వేల లైకులు కూడా వచ్చాయి. దాంతోపాటు ఆడియో జ్యూక్‌బాక్స్‌కు 40 లక్షల లైకులు వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క "గీతగోవిందం"కు తప్ప మరే సినిమాకు సాధ్యం ఈ రికార్డ్ రాలేదు. మరి ఫుల్‌రన్ పూర్తయ్యే లోపు "గీతగోవిందం" ఖాతాలో ఇంకెన్ని రికార్డులు చేరనున్నాయో..?
https://youtu.be/rQA5YM9UDrg
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.