హోమ్ /వార్తలు /సినిమా /

Gruhalakshmi: ఏప్రిల్ 16 (ఈరోజు) ఎపిసోడ్.. అభి తులసిని వదిలి వెళ్లిపోతాడా? గాయత్రి ఇచ్చిన కొత్తింటి తాళాలు తీసుకుంటాడా ?

Gruhalakshmi: ఏప్రిల్ 16 (ఈరోజు) ఎపిసోడ్.. అభి తులసిని వదిలి వెళ్లిపోతాడా? గాయత్రి ఇచ్చిన కొత్తింటి తాళాలు తీసుకుంటాడా ?

ఇంటింటి గృహలక్ష్మీ ఏప్రిల్ 16 ఎపిసోడ్

ఇంటింటి గృహలక్ష్మీ ఏప్రిల్ 16 ఎపిసోడ్

ఇవాళ రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో అంకితను తులసి సముదాయిస్తోంది. అటు అంకిత తల్లి గాయిత్రి కూడా అల్లుడు అభిని పిలిచి మాట్లాడుతోంది. కూతుర్ని కొత్తంటికి తీసుకెళ్లమంటోంది.

తులసి కోడలు అంకిత తల్లి .. తులసి ఇంటికి వెళ్తోంది. కూతురు అంకిత అత్తగారింట ఇంట్లో పనులు చేస్తూ చూసిన గాయిత్రి తులసిపై రంకెలేస్తోంది. మిడిల్ క్లాస్ లైఫ్‌లు ఇలాగే ఉంటాయంటూ.... తులసి కుటుంబాన్ని నానా మాటలు అంటోంది. అటు అంకిత కూడా తల్లిని చెడామడా తిట్టేస్తోంది. నా మంచి కోరుకుంటే.. ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ..అంకిత తల్లి గాయిత్రిని తులసి ఇంటి నుంచి బయటకు పంపించేస్తోంది.

ఇక ఇవాళ రాత్రి (ఏప్రిల్ 16)న ప్రసారం కాబోయే సీరియల్‌లో తల్లిపై కోపంతో నిల్చున్న అంకితను తులసి సముదాయించేందుకు ప్రయత్నిస్తుంది. ‘నీ మీ ప్రేమ లేకుంటే నువ్వు కష్టపడుతున్నావని తెలసి ఎందుకు వస్తోంది అని తులసి అంటోంది. దానికి సమాధనం అంకిత చెబుతూ‘ నేను ఈ ఇంటిలో ఒంటరిగా లేను.ఓ ఇంటి కోడలుగా అత్తారింట్లో ఉంటున్నాను.నాకు మా అమ్మ ఎంతో.. మీరు అంతే. మా అమ్మ ఈ ఇంటికి వచ్చేటప్పుడు నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో.. మీ మీదే అంతే గౌరవం చూపించాలి అంటోంది. అదే పద్ధతి. ఇంత వయసు వచ్చాక మా అమ్మకు ఇది నేను నేర్పించాలా ?తనకు తెలియదా ? నేను ఈ ఇంట్లో మనిషిని.. ఈ ఇంట్లో ఉన్న తన మనిషిని కాదు అంటోంది. నిజంగా ఈ ఇంట్లో అందరం పస్తులున్నామని తను అనుకుంటే తను వచ్చి నా ఒక్కదాన్ని కడుపు నింపుతానంటూ నాకు ఎలా ఉంటుంది. నాలో అంత స్వార్థం లేదాంటీ.. ఉండి ఉంటే అభి కోసం అన్నీ వదులుకొని వచ్చేదాన్ని కాదు అంటోంది అంకిత.

దానికి తులసి సమాధానం ఇస్తూ.. ఇదే మాట మీ అమ్మకు నెమ్మదిగా అర్థం అయ్యేలా చెప్పాల్సింది. అర్థం కాని వాళ్లకైతే నిజంగా నెమ్మదిగా అర్థం అయ్యేలా చెప్పొచ్చాంటీ. కః అర్థం అయి కూడా మూర్ఖంగా మాట్లాడేవాళ్లకు ఏంచెబుతాం అంటోంది అంకిత. వాళ్లకు వాళ్ల భాషలోనే చెప్పాలని అంటుంది. దానికి తులసీ అది కాదమ్మ అంటూ అడ్డు తగిలే ప్రయత్నం చేస్తోంది. మిమ్మల్ని ఓ మాట అడుగుతాను చెప్పండి? ఎవరైనా మీ అత్త మామల్ని ఒక మాట అంటే.. మీరు ఊరుకుంటారా? మరి మా అమ్మ మిమ్మల్ని అంటుంటే నేనెలా ఊరుకుంటాను. అనేది మీ అమ్మగారు అమ్మ అంటూ తులసి. ఎవరైనా నాకు ఒక్కటే. మిమ్మల్ని గౌరవించని వాళ్లను నేను కూడా గౌరవించను. మిమ్మల్ని ఇష్టపడని వాళ్లను నేను కూడా ఇష్టపడను అంటోంది అంకిత. తన దగ్గరకు కూడా రానీయను. ఇలా మూర్ఖంగా ఉంటే నువ్వు మీ అమ్మకు శాశ్వ పుట్టింటికి దూరమవుతామని అంటోంది తులసి. దానికి అంకిత బదులిస్తూ.. మారాల్సింది నేను కాదు మా అమ్మ అంటోంది. దీంతో తులసి మరోసారి ఆలోచనలో పడిపోతుంది. తన కారణంగా కోడలు అంకిత పుట్టింటికి దూరమవుతుంది అని తనలో తాను టెన్షన్ పడుతుంటుంది.ప్రేమ్ లాగానే.. అంకితకు కూడా తాను బలహీనతగా మారానా ? ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచనలో పడిపోతుంది

అంకిత.. ఏంటి ఆంటీ అలా ఆలోచిస్తున్నారు అంటూ...తులసిని అడుగుతోంది.ప్రేమ్ వాళ్ల నాన్నపై తిరగబడితే ఇంట్లో నుంచి తరిమేశారు. నన్ను కూడా మా అమ్మ మీద తిరగబడినందుకు నాకు అదే శిక్ష వేస్తారా ? అంటూ ప్రశ్నిస్తోంది. దానికి తులసి సమాధానం ఇస్తూ... అయ్యో అలా చేయనమ్మ.. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అని అంకితతో అంటోంది. దానికి అంకిత ‘ థాంక్స్ ఆంటీ.. మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు.మీ అబ్బాయికి నేను ఇప్పటికీ అర్థం కాను అంటుంది. ఇంతలో బయట నుంచి అమ్మా తులసి అంటూ ఓ పిలుపు వినిపిస్తోంది. తులసి తిరిగి చూస్తే అక్కడ తనకు వాళ్ల అమ్మ కనిపిస్తోంది. దీంతో తులసి వెళ్లి వాళ్ల అమ్మను ఆనందంతో కౌగిలించుకుంటుంది. ఎదురుగా కనిపిస్తేనే ఆపేక్ష.. అమ్మ దగ్గరకు వెళ్లాలి చూడాలి అనిపించదా అంటూ తెలిసిన వాళ్ల అమ్మ ప్రశ్నిస్తోంది. ఎందుకు అనిపించదు.. అంటుంది తులసి. అలా అనిపిస్తే అమ్మను చూసేందుకు వచ్చేదానివి కదా అమ్మను రప్పించేదానివి కాదు అంటోంది తులసి వాళ్ల అమ్మ. వీళిద్దరూ మాట్లాడుకుంటుంటే.. ఇంతలో తులసి చిన్న కూతురు దివ్య పరిగెత్తుకొని వచ్చి అమ్మమ్మ అంటూ... హగ్ చేసుకుంటుంది. ఏ రోజు చివరి రోజు అవుతుందో తెలియదు..అందర్నీ చూడాలి అనిపిస్తుంది. ఒక్క దాన్నే కదిలి రావడం కష్టం అంటూ అంటుంది తులసి వాళ్ల అమ్మ. ఇక తులసి వాళ్ల అమ్మను ఇంటి లోపలకు తీసుకెళ్తోంది. అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు.

తులసి అత్త మామలు... తులసి అమ్మతో మాట్లాడుతుంటారు. మా వల్లే తులసి జీవితం ఇలా అయ్యిందంటారు. దానికి తులసి వాళ్ల అమ్మ మాట్లాడుతూ... ఒకరు దురదృష్టానికి ఇంకొకరు కారణం కాదు అంటుంది. రాసిపెట్టి ఉంది జరిగింది. అనుభవించాల్సి ఉంది అనుభవిస్తోంది అంటుంది. ఇంతలో తులసి అత్త మాట్లాడుతూ.. కోడలు అయినా.. మమ్మల్ని కూతురులా అభిమానిస్తుంది అంటుంది. ఆ తర్వాత తులసి అమ్మ మాట్లాడుతూ.... మీ అందర్నీ చూస్తుంటే నాకు అసూయగా ఉంటుందని అంటుంది. అత్తమామల్ని వదిలొస్తే ఏం అవుతారోనని భయంతోనే నా దగ్గరకు తులసి రావడం లేదంటోంది తల్లి. ఆ తర్వాత తులసి మామ మాట్లాడుతూ.. మా వల్లే తులసికి ఇన్ని కష్టాలు అని అంటారు. దానికి తులసి బదులిస్తూ... కష్టాలు ఎలా ఎదుర్కొవాలో తనకు అమ్మే నేర్పించింది అంటారు. ఇక ఇంతలో అంకిత అందరికి వంట చేస్తాను అని ... దివ్య అమ్మమ్మతో కలిసి భోజనం చేసి చాలా రోజులు అయింది అంటోంది.

ఇక ఆ తర్వాత ప్రేమ్ ఓ లిరిక్ రైటర్ దగ్గర పనిచేస్తూన్న సీన మన ముందుకు వస్తోంది. సినిమాకు పాట రాయాలంటూ ప్రేమ్ బాస్‌ను సినిమా వాళ్లు తొందర పెడుతంటారు. అనుకున్న టైమ్‌కు తనకు పాట కావాలని కోరుతుంటాడు. దీంతో లిరిక్ రైటర్ టెన్షన్ పడుతుంటాడు. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న ప్రేమ్.... ఇదే మంచి టైం అని మనసులో అనుకుంటాడు. టెన్షన్ పడకండి అంటూ.. తన బాస్‌కు లిరిక్సే కదా రాసేద్దాం... కంటెంట్ చెబితే.. తాను లిరిక్స్ రాస్తాను అన్నాడు. ఒక్క ఛాన్స్ వస్తే.. మీ పేరు నిలబడతాను అంటాడు. ఇంతకుముందు చాలా పాటలు రాసాను అన్నాడు. దీంతో ప్రేమ్‌కు సిచ్చువేషన్ వివరిస్తాడు. పాట రాసుకొని వస్తాను అంటూ అక్కడ్నుంచి వెళ్తాడు. దీంతో ప్రేమ్‌ను చూసిన అతని సార్.. నిజంగా పాట రాసుకొని వస్తాడా ? అంటూ అనుకుంటాడు. ఒక వేళ వస్తే.. పాట నాదే డబ్బు కూడా నాదే అనుకుంటూ తనలో తానే అనుకుంటాడు.

ఇక ఆ తర్వాత తులసి... వాళ్ల అమ్మ మధ్య మాట్లాడుకుంటుంటారు. అందరి కష్టాలు తీర్చే నీకు.. కష్టం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అయ్యో అనడం తప్పా.. ఎవరూ ఏం చేయడం లేదు అంటుంతో తులసి వాళ్ల అమ్మ. తనకు కష్టం వస్తే..తన కష్టం తానే చూసుకుంటానని అంటుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తే తన కష్టం పోతుందని అనుకుంటే.. అదేదో తానే చేస్తానని అంటోంది తులసి. తనతో పాటు ఇంటికి రమ్మంటే కూడా రాకుండా ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటావు అని అంటోంది తులసి వాళ్ల అమ్మ. దానికి బదులిస్తూ.. తాను ఒంటరిగా ఉండటం లేదని... పిల్లలతో అత్తమామలతో కలిసి ఉంటున్నానని చెబుతోంది. చిన్నప్పుడు నీ జీవితంపై ఎన్నో కలలు కన్నావని అంటోంది తులసి తల్లి. జీవితం గడుస్తుంటే.. తనకు తెలుస్తోందని.. కలలకు నిజానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుందని అంటుంది తులసి. జాతకాలు కలిసాయని నీకు నందుకు పెళ్లి జరిపించామని అంటుంది తులసి తల్లి. జాతకాలు కలిస్తే పెళ్లి జరుగుతుంది. కాపురాలు నిలబడాలంటే మనసులు కలవాలని అంటోంది తులసి. నందు గురించి ఏ మాత్రం అనుమానం ఉన్నా పెళ్లి జరిగనిచ్చేదాన్ని కాదన్నాను. అతడ్ని ప్రేమించాను.. పెళ్లి కోసం పట్టుబట్టాను అంది తులసి. మనసులు కలవకపోతే.. 25 ఏళ్లు తర్వాత విడిపోవడం ఏంటని అడుగుతోంది. పుట్టింటికి వచ్చేయ్ మని అడుగుతోంది తులసి వాళ్ల అమ్మ. నేను భర్తనే కాదనుకున్నా.. జీవితాన్ని కాదు అంటోంది తులసి. ఒక యుద్ధంలో ఓడిపోయాను.. మరో యుద్ధంలో అయినా గెలవాలి కదా అమ్మ అంటోంది తులసి. ఇక వారిద్దరూ మాట్లాడుకుంటూ.. తులసి కోసం ఓ కానుక తెచ్చాను అంటుంది ఆమె తల్లి. ఆ తర్వాత ఓ రోజా మొక్కను తీసి ఆమెకు ఇస్తుంది.

పెళ్లికి ముందు రోజా మొక్కే నీ స్నేహితురాలు.. అన్నీ దీనితోనే చెప్పుకొనేదానివి అందుకే గుర్తుపెట్టుకొని మరి తెచ్చాను అని తులసి వాళ్ల అమ్మ రోజా మొక్కను ఇస్తోంది. ఇక నుంచి ఏ కష్టం వచ్చిన.. ఏం మాట్లాడాలని అనిపించినా ఈ మొక్కతోనే చెప్పుకో. ఎవరితో చెప్పుకోని విషయాలు ఈ రోజా మొక్కతో చెప్పుకుంటూ ఉండూ.. అంటూ తులసి వాళ్ల అమ్మ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత అంకిత తల్లి గాయిత్రి.. అంకిత భర్త అభిని కలుస్తోంది. తన కూతురు అత్తింట్లో కష్టాలు పడుతుందని... అభిని నానా మాటు అంటోంది. అంకిత ఏ కష్టం పడటం లేదని.. తనను తన తల్లి కన్న కూతురులా చూసుకుంటుందని అంటాడు. దానికి గాయిత్రి వినకుండా కష్టాలే జీవితం కాకూడదు..అంటోంది గాయత్రి. ఒక్క కూతురు... నా దగ్గర కావాల్సిన ఆస్తి,అంతస్తు,పలుకుబడి హోదా అన్నీ ఉన్నాయని చెబుతుంది. నన్ను అర్థం చేసుకోకుండా శతృవులా చూస్తుందంటుంది. దానికి పరిష్కారం లేదంటాడు అభి. దీంతో గాయత్రి తన దగ్గర పరిష్కారం ఉందని చెబుతోంది. మీ ఇద్దరు ఆ ఇల్లు వదిలి తన ఇంటికి రావాలని అంటోంది. దానికి అభి రాలేనని తెగేసి చెబుతారు. అయితే దానికి మరో పరిష్కారం ఉంది. అంకిత పేరుపై త్రిబుల్ బెడ్ రూం ఇంటిని కొన్నానని ... ఆ ఇంటికి వెళ్లాలని కోరుతోంది. అంకిత కోసం కొన్న కొత్తింటి తాళం చెవి అభికు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.అక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తోంది.

ఇక తరువాత ఎపిసోడ్‌లో తులసి ఇంటికి వస్తాడు భర్త నందు. చిన్న కూతురు దివ్యకు సంబంధించిన స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ ఉంటుందని.. దానికి వెళ్లాలని అంటాడు. దాంతో తులసి ... అతడ్ని అడ్డుకుంటుంది. దివ్య బాధ్యత తనదని నందుది కాదని అంటోంది. దీంతో నందు దివ్యకు తాను తండ్రినని అంటాడు. అంతటితో ఆగకుండా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత దివ్యదని అంటాడు.

First published:

Tags: Indian television actress, Television show, Telugu television

ఉత్తమ కథలు