టాలీవుడ్ ప్రముఖ నటులు జీవితా రాజశేఖర్ ఎప్పుడూ ఏదో ఓ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా వారిపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాతతో వీరికి వివాదం నెలకొంది. ఇప్పుడు అదే చినికి చినికి గాలివానగా మారింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా జీవిత తన కాళ్లు పట్టుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గరుడ వేగ నిర్మాత కోటేశ్వర్రావు. అంతేకాదు జీవితకు డబ్బు పిచ్చి కూడా ఉందని ఆయన ఆరోపించారు.
జీవితా రాజశేఖర్( Jeevitha Rajasekhar ) చేసిన వ్యాఖ్యలపై గరుడవేగ సినిమా నిర్మాత కోటేశ్వర రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ల పై పలు కీలక ఆరోపణలు చేశారు కోటేశ్వర్రావు. జీవితా రాజశేఖర్ తమపై చేస్తోన్నవన్నీ అసత్య ఆరోపణలనే అన్నారాయన. అసలు వారి ఇంట్లో దొరికిన దృశ్యాలకు మాకు ఏం సంబంధం లేదన్నారు. గతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద కోట్ల రూపాయలు సీజ్ చేశారు.. ఇప్పుడు మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. నిజానికి జీవితా రాజశేఖర్ ప్రోడ్యూసర్లను ట్రాప్ చేస్తుంది.. కానీ మేము ఆమె ట్రాప్ లో పడమన్నారు.
అంతేకాదు.. జీవితా రాజశేఖర్ తన మామను తీసుకొచ్చి నా భార్య హేమ కాళ్లు పట్టుకుని కోట్ల రూపాయలు అప్పు తీసుకుందని చెప్పారు. హీరో రాజ శేఖర్ కు డబ్బు అవసరంలేదు.. కానీ అతని భార్య జీవితకు డబ్బు అవసరం ఉంది.. అందుకనే ఆమె తన కూతళ్లను అడ్డుపెట్టుకుని ఇప్పుడు డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జీవిత గతంలో చాలాసార్లు మోసం చేసిందని రాజశేఖర్ తండ్రి వరదరాజన్ మా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారని చెప్పుకొచ్చారు కోటేశ్వర్రావు. రాజశేఖర్ యాక్సిడెంట్లు చేయడం, ఆమె కవర్ చేయడం ఎవరికి తెలియదని ప్రశ్నించారు. జీవిత రాజశేఖర్ బతుకుంతా మోసమేనని చెప్పాడు. జీవితపై నిర్మాత కోటేశ్వరరాజు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
26 కోట్లు తీసుకుని ఎగవేశారంటూ జీవిత రాజశేఖర్‌పై నిర్మాత రాజు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పరిస్థితి ముదిరింది. తనపై కేసు పెట్టడంతో జీవిత రాజశేఖర్ మీడియా సమావేశం పెట్టి..నిర్మాత రాజుపై ప్రత్యారోపణలు చేసింది. తమ పరువు తీసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. కేసులుంటే కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి నిర్మాత కోటేశ్వరరాజు జీవితరాజశేఖర్‌పై ఆరోపణలు చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జీవిత గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. సినిమా ముసుగులో జీవిత చాలామందిని ఇలానే మోసం చేసిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jeevitha, Jeevitha rajashekar, Rajasekhar, Tollywood