Home /News /movies /

GANGSTER GANGARAJU MOVIE REVIEW LAKSH CAME UP WITH COMMERCIAL CINEMA TA

Gangster Gangaraju Review: ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ రివ్యూ.. కమర్షియల్ బొమ్మే కానీ..

గ్యాంగ్‌స్టర్ గంగరాజు రివ్యూ (Gangster Gangaraju Review)

గ్యాంగ్‌స్టర్ గంగరాజు రివ్యూ (Gangster Gangaraju Review)

Gangster Gangaraju Review: కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు లక్ష్ చదలవాడ. 'వలయం' సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ వారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది.. దాని రివ్యూ ఏంటి చూద్దాం..

ఇంకా చదవండి ...
రివ్యూ: గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు
నటీనటులు: లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: క‌ణ్ణ పి.సి.
ఎడిటర్‌ : అనుగోజు రేణుకా బాబు
దర్శకత్వం: ఇషాన్ సూర్య‌

కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు లక్ష్ చదలవాడ. 'వలయం' సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ వారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది.. దాని రివ్యూ ఏంటి చూద్దాం..

కథ:

గంగరాజు (లక్ష్య్‌) దేవరలంకలో ఓ గ్యాంగ్‌ వేసుకొని ఆవారాగా తిరుగుతుంటాడు. అతడి తండ్రి నాగరాజు( గోపరాజు రమణ) రైల్వే ఉద్యోగి. రిటైర్మెంట్ వయసుకు వచ్చిన తర్వాత కూడా కొడుకు మాత్రం జులాయిగా తిరుగుతుంటాడు. గంగరాజు ఉండే ఏరియాలోకే కొత్తగా వచ్చిన ఎస్సై ఉమాదేవి (వేదిక దత్త)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె ప్రేమ కోసం నానా తిప్పలు పడుతుంటాడు. అలాంటి సాధారణ గంగరాజు కాస్తా అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌ సిద్దప్పని హత్య చేస్తాడు. ఆ ఒక్క సంఘటనతో గంగరాజు జీవితమే మారిపోతుంది. ఊరంతా అతన్ని గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు అని పిలవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. గంగరాజు జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది అసలు కథ..

కథనం:
‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’.. టైటిల్‌తోనే సినిమా కథేంటో చెప్పకనే చెప్పేసాడు దర్శకుడు ఇషాన్ సూర్య. అయితే టైటిల్‌లో ఉన్న యాక్షన్ సినిమాలో కనిపించదు. సినిమా టోన్ అంతా కామెడీ, యాక్షన్‌గానే సాగుతుంది. మరీ ముఖ్యంగా ఇందులో కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు సూర్య. కథంతా కామెడీగా సాగుతూనే అక్కడక్కడ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చాడు దర్శకుడు ఇషాన్ సూర్య. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. అక్కడే సన్నివేశాలు కూడా తిరుగుతుంటాయి. హీరోయిన్ ప్రేమ కోసం గంగరాజు చేసే పనులు బాగానే నవ్వు పుట్టించాయి. అలాగే బామ్మగా అన్నపూర్ణమ్మ చేసే ఫైట్‌ సీన్‌ థియేటర్స్‌లో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ వరకు ఎలాగోలా లాక్కొచ్చిన దర్శకుడు.. అక్కడ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. సెకండాఫ్‌లో గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు అసలు రూపం బయటపడుతుంది. రౌడీ బసిరెడ్డి నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే నర్సారెడ్డిని బకరా చేసిన తీరు బాగానే ఉంటుంది. క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ కూడా పర్లేదు. క్లైమాక్స్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. రొటీన్ స్క్రిప్ట్ కావడం.. పైగా కొత్త వాళ్లు సినిమాలో ఉండటంతో ఈ సినిమాకు మైనస్‌గా మారింది.

నటీనటులు:
వలయం సినిమాతోనే తాను రెగ్యులర్ కమర్షియల్ హీరో కాదని చెప్పాడు లక్ష్. ఆ తర్వాత కూడా ఎంచుకునే కథలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ గంగరాజు కూడా కమర్షియల్ కథే అయినా.. అందులోనూ విభిన్నంగా ఉండేలా చూసుకున్నాడు లక్ష్. గంగరాజుగా బాగానే చేసాడు.. మంచి మార్కులు పడతాయి ఈయన నటనకు. కామెడీ, ఫైట్స్‌, ఎమోషన్ అన్నీ బాగానే పండించాడు. ఎస్సై ఉమాదేవిగా వేదిక దత్త బాగానే సెట్ అయింది. హీరో తండ్రి పాత్రలో గోపరాజు రమణ.. ఎమ్మెల్యే నర్సారెడ్డిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ బాగానే ఆకట్టుకున్నారు. చరణ్‌ దీప్‌, వెన్నెల కిశోర్‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ అంతా ఓకే అనిపించారు.

టెక్నికల్ టీమ్:
సాయి కార్తీక్‌ సంగీతం పర్లేదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది. క‌ణ్ణ పి.సి. సినిమాటోగ్రఫీ బాగుంది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్‌ ఓకే అనిపిస్తుంది. కాకపోతే అక్కడక్కడా కత్తెర పడాల్సిన సన్నివేశాలున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

చివరగా ఒక్కమాట:
గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. కమర్షియల్ సినిమానే కానీ కండీషన్స్ అప్లై..

రేటింగ్: 2.5/5
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు