Home /News /movies /

GANGAVVA BUYS GOLD FOR ONE LAKH WITH BIGG BOSS CHECKS MNJ

Gangavva: బిగ్‌బాస్ చెక్కుల‌తో షాపింగ్‌.. ల‌క్ష రూపాయ‌ల‌ బంగారం కొన్న గంగ‌వ్వ‌

గంగ‌వ్వ

గంగ‌వ్వ

బిగ్‌బాస్ సీజ‌న్ 4(Bigg Boss 4)లో పాల్గొన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల‌లో గంగ‌వ్వ(Gangavva) ఒక‌రు. హౌజ్‌లోకి గంగ‌వ్వ ఎంట్రీ ఉంద‌ని ఊహాగానాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఆమె ఫ్యాన్స్ ఎంతో సంతోష‌ప‌డ్డారు.

    Gangavva: బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల‌లో గంగ‌వ్వ ఒక‌రు. హౌజ్‌లోకి గంగ‌వ్వ ఎంట్రీ ఉంద‌ని ఊహాగానాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఆమె ఫ్యాన్స్ ఎంతో సంతోష‌ప‌డ్డారు. ఇక హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొద‌టి రోజే పోలింగ్ ఓట్ల‌లో టాప్‌లో నిలిచింది గంగ‌వ్వ‌. అంతేకాదు హౌజ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉండేది. కానీ ఒకానొక స‌మ‌యంలో ఇంటి మీద దిగులుతో ఆమె డీలా ప‌డ్డారు. అప్పుడు నాగార్జున స‌హా అంద‌రూ గంగ‌వ్వ‌కు భ‌రోసా ఇచ్చారు. ఆ త‌రువాత‌ ఆమెకు చాలా ప్రోత్సాహం ల‌భించిన‌ప్ప‌టికీ.. అనారోగ్య స‌మ‌స్యల కార‌ణంగా ఆమె అనూహ్యంగా హౌజ్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బిగ్‌బాస్ అభిమానులే కాదు గంగ‌వ్వ అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. అయితే ఆమె ఆరోగ్యం బావుండాల‌ని అంద‌రూ కోరుకున్నారు.

    ఇక బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక గంగ‌వ్వ మ‌రింత ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఒక‌ప్పుడు మై విలేజ్ షోలో న‌టించే గంగ‌వ్వ.. ఆ త‌రువాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ని పెట్టుకున్నారు. అందులో త‌న అనుభ‌వాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇలా తాజాగా ఓ వీడియోను విడుద‌ల చేశారు గంగ‌వ్వ‌. బిగ్‌బాస్‌ షోలో ఒకసారి ఫ్యాష‌న్ షోలో పాల్గొన్నందుకు గానూ గంగ‌వ్వ‌కు చెక్కులు వ‌చ్చాయి.








    View this post on Instagram






    A post shared by Milkuri Gangavva (@gangavva)






    ఇక వాటిని తీసుకొని హైద‌రాబాద్‌కి వ‌చ్చిన గంగ‌వ్వ బంగారం కొనింది. ల‌క్ష రూపాయ‌లు విలువ చేసే నాణెల‌ను గంగ‌వ్వ కొనుగోలు చేసింది. ఇక ఆ బంగారు నాణేల‌ను త‌న వారికి చూపించిన గంగ‌వ్వ సంతోషం వ్య‌క్తం చేసింది. ఇల్లు ప‌నులు ప్రారంభం అయ్యాయ‌ని.. ఇంట్లో చేరే స‌మ‌యంలో అంద‌రికీ బ‌ట్ట‌లు కొనిస్తాన‌ని మై విలేజ్ షోలో న‌టించే రాజు, అనిల్‌ల‌కు మాటిచ్చింది గంగ‌వ్వ‌.
    Published by:Manjula S
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు