HOME »NEWS »MOVIE »gang leader promotional song released and anirudh ravichandra nani dance was superb pk

అనిరుధ్ మొదలెట్టాడు.. నాని గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ అదుర్స్..

అనిరుధ్ మొదలెట్టాడు.. నాని గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ అదుర్స్..
గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్

సంగీత దర్శకులే రాక్ స్టార్స్ అయిపోయి.. పాటలను జనాల్లోకి తీసుకెళ్లే పద్దతి మొదలుపెట్టింది దేవీ శ్రీ ప్రసాద్. తెలుగులో ఈయనకు ఫాలోయింగ్ అంతగా పెరగడానికి కారణం కూడా అదే.

  • Share this:
    సంగీత దర్శకులే రాక్ స్టార్స్ అయిపోయి.. పాటలను జనాల్లోకి తీసుకెళ్లే పద్దతి మొదలుపెట్టింది దేవీ శ్రీ ప్రసాద్. తెలుగులో ఈయనకు ఫాలోయింగ్ అంతగా పెరగడానికి కారణం కూడా అదే. ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు తెలుగులో తన సత్తా చూపిస్తున్నాడు. అజ్ఞాతవాసితో తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ సంగీత దర్శకుడు.. జెర్సీ సినిమాతో మరో మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో మరోసారి సత్తా చూపించాలని వస్తున్నాడు అనిరుధ్. ఇందులో భాగంగానే ఇప్పుడు విడుదలైన గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ అదిరిపోయింది.

    తెలుగులో దేవీ మాత్రమే ఇలా ప్రమోషనల్ సాంగ్స్ చేస్తాడు. తర్వాత థమన్ కూడా చేసాడు. ఇప్పుడు అనిరుధ్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే ఈయన తమిళనాట శివకార్తికేయన్ లాంటి హీరోలతో కలిసి అదిరిపోయే ప్రమోషనల్ సాంగ్స్ చేసాడు. ఇప్పుడు నానితో కలిసి చేసిన పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ వస్తున్నాడు అంటూ చిందేసిన ఈ పాట పిచ్చెక్కిస్తుంది. ఫ్యాన్స్‌ను కూడా నేచురల్ స్టార్ డాన్సులు ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ విడుదల కానుంది.
    Published by:Praveen Kumar Vadla
    First published:September 05, 2019, 22:22 IST

    टॉप स्टोरीज