‘గ్యాంగ్ లీడర్’ 6 డేస్ కలెక్షన్స్.. చాలా దూరంలో ఆగిపోయిన నాని..

నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. గత వారం ఈయన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 2:38 PM IST
‘గ్యాంగ్ లీడర్’ 6 డేస్ కలెక్షన్స్.. చాలా దూరంలో ఆగిపోయిన నాని..
నాని ‘గ్యాంగ్ లీడర్ (Twitter/Photo)
  • Share this:
నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. గత వారం ఈయన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు మూడు రోజుల వరకు టాక్‌తో పని లేకుండా మంచి వసూళ్లే వచ్చాయి. అయితే అసలు ఆట నాలుగో రోజు నుంచి మొదలైంది. వీక్ డేస్ మొదలయ్యే సరికి పూర్తిగా వీక్ అయిపోయాడు గ్యాంగ్ లీడర్. ఇప్పటి వరకు ఈ చిత్రం 6 రోజుల్లో కేవలం 16 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

Nani Gang Leader movie 4 days Worldwide Collections and Natural Star movie slows down on Monday pk నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. గత వారం ఈయన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. Gang Leader movie 6 days AP/TS Collections,Gang Leader 6 days AP/TS Collections,Gang Leader Collections,nani twitter,nani Gang Leader movie 6 days AP/TS Collections,Gang Leader movie 6 days Worldwide Collections,gang leader ww collections,gang leader 6 days ww collections,telugu cinema,నాని,గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్,గ్యాంగ్ లీడర్ 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
నాని ‘గ్యాంగ్ లీడర్’ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)


ఎంసిఏ సినిమాతో రెండేళ్ల కిందే 40 కోట్ల మార్క్ అందుకున్నాడు నాని. కానీ అప్పటికీ ఇప్పటికీ మార్కెట్ పెరుగుతుందనుకుంటే తగ్గిపోయింది. గ్యాంగ్ లీడర్ తొలిరోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో మరో 10 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. ఓవర్సీస్‌లో కూడా 8 లక్షల డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం. అక్కడ సేవ్ అవ్వాలంటే 1 మిలియన్ దాటాల్సిందే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో నాలుగు రోజుల్లో 15 కోట్ల షేర్ వసూలు చేసింది గ్యాంగ్ లీడర్. ఇక్కడ 20 కోట్లకు ఈ చిత్ర రైట్స్ అమ్మారు దర్శక నిర్మాతలు.

Gang Leader movie 1st Day Worldwide Collections prediction and Nani crossed all his previous records pk నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. gang leader,gang leader twitter,gang leader 1st ww collections,nani gang leader 1st day worldwide collections,gang leader 1st day collections,gang leader,1st day gang leader collections,gang leader box office collection day 1,nani gang leader,gang leader day 1 collections,nani gang leader collections,day 1 gang leader collections,gang leader collections day 1,gang leader box office collections,gang leader trailer,nani gang leader 1st day collections,గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్,గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
నాని ‘గ్యాంగ్ లీడర్’ (ఫైల్ ఫోటో)


నైజాంలో 7.50 కోట్లకు రైట్స్ అమ్మగా.. ఇప్పటి వరకు కేవలం 5.80 కోట్లు మాత్రమే వచ్చాయి. సినిమాలో కామెడీ అక్కడక్కడా బాగానే వర్కవుట్ కావడంతో రొటీన్ కథ అయినా కూడా నాని మేనియాలో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 30 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం వచ్చిన టాక్ చూస్తుంటే ఇంత రావడం కష్టమే అనిపిస్తుంది కానీ నాని అదృష్టం బాగుంటే బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయినా అవ్వొచ్చు. కానీ రెండో వారం వాల్మీకితో పాటు సూర్య బందోబస్త్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. దాంతో గ్యాంగ్ లీడర్ వాటి దూకుడు ఎంతవరకు తట్టుకుంటుందనేది చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 19, 2019, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading